ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మహేష్

Mahesh Babu Plans A Special Surprise To His Fans On Super Star Krishna Birthday
Mahesh Babu Plans A Special Surprise To His Fans On Super Star Krishna Birthday

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో గడుపుతున్నాడు. మామూలుగానే సినిమా షూటింగ్‌ల సమయంలో ఏ కాస్త విరామం దొరికినా తన ఫ్యామిలీకే కేటాయిస్తుంటాడు. ఇక ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో తన పిల్లలతో కలిసి చేసే అల్లరి పనులను ఎప్పటికప్పుడు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తునే ఉన్నారు. ఇక మహేష్ బాబు తన పిల్లలతో చేసే అల్లరి.. తనలో ఉన్న మరో యాంగిల్ ను చూసి అభిమానులు ఇప్పటికే ముచ్చటపడిపోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటివరకూ తన వీడియో లతో సర్పరైజ్ ఇచ్చిన మహేష్..తాజాగా మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. సాధారణంగా సోషల్ మీడియా లో లైవ్ ల ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చటించడం మహేష్ బాబు కు పెద్దగా అలవాటు లేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు తన పంథా మార్చుకున్నారు. రేపు ఆయన తన అభిమానులతో ముచ్చటించనున్నారు. మహేష్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఛాట్ చేయనున్నారు. రేపు తన తండ్రిగారైన కృష్ణ పుట్టినరోజు సంధర్భంగా మహేష్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ లో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం మొదలుకానుంది. మరి ఇంత ఆఫర్ ఇచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఊరుకుంటారా..? మహేష్ కొత్త సినిమా విశేషాలు మొత్తం రాబడతారేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.