మరోసారి ‘రియల్ హీరో’ అనిపించుకున్న మహేష్..!

Super Star Mahesh Babu Once Again Proves Himself To Be A Real Hero

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే సాయం గురించి ఎవరితో చెప్పుకోరు అన్న సంగతి తెలిసిందే. ఎంతో మందికి తాను సాయం చేశాడు. కానీ ఏరోజు తాను చేసిన సాయం గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అది మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో సామజిక సేవల్లో పాల్గొంటూనే ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తుంటారు.. చిన్న పిల్లలకు ఎలాంటి విపత్తు వచ్చినా తనవంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు మహేష్. అసలు సంగతేంటంటే.. తూర్పు గోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు ఇటీవల ఓ ఆడపిల్ల పుట్టింది. అయితే ఆ చిన్నారికి అరుదైన గుండె జబ్బు వుంది. ఆమె శరీరంలో చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహేశ్ బాబు, పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్లను కోరారట. ఈనెల 2వ తేదీన ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ తరువాత పాప ఆరోగ్య పరిస్థితి కాస్తంత క్షీణించింది. బీపీ పడిపోవడం, గుండె కొట్టుకోవడంలో మార్పులు కనిపించడంతో, వైద్యులు పాపను ఐసీయూకు తరలించారు. రెండు వారాల తరువాత పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇక తమ పాప ప్రాణాలు కాపాడినందుకు పాప తల్లితండ్రులు మహేష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దీనితో మహేష్ బాబు అభిమానులు తమ హీరో చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా మహేష్ తన తర్వాత సినిమా పరుశురాం తో చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.