‘సర్కారు వారి పాట’ ఖాతాలో మొదటి రికార్డ్

Super Star Mahesh Babu New Movie Sarkar Vaari Pata Already Sets A New Record
Super Star Mahesh Babu New Movie Sarkar Vaari Pata Already Sets A New Record

అలా వచ్చాడో లేదో ఇలా అప్పుడే రికార్డులు క్రియేట్ చేసే పనిలో పడ్డాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. నిన్న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ సినిమా టైటిల్ ను, ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రాక రాక తమ హీరో సినిమా అప్ డేట్ వచ్చింది..మరి మహేష్ బాబు ఫ్యాన్స్ ఊరుకుంటారా. ‘సర్కారు వారి పాట’లో లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ ప్లస్ మాస్ లుక్ లో వుండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ లుక్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో సోషల్ లైక్ లు, షేర్ లతో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అంతేకాదు మరో రికార్డు ను కూడా సొంతం చేసుకుంది. 24 గంటల్లో మోస్ట్ రీట్వీట్ చేసిన ప్రీ లుక్ ఇదే, అలాగే మోస్ట్ లైక్స్ వచ్చిన ప్రీ లుక్ కూడా ఇదే, అదే విధంగా మోస్ట్ ట్వీట్ చేసిన హ్యాష్ ట్యాగ్ కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈ విషయాన్నీ మైత్రి మూవీస్ వారు తమ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పరుశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో నటించే హీరోయిన్.. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. మరి ప్రీ లుక్కుకే రికార్డ్స్ క్రియేట్ చేస్తే ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 1 =