కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Latest News

ట్యాగ్ · 168 కథనాలు · పేజీ 6

సినిమా వార్తలు

అన్నయ్యకు హాపీ బర్త్ డే - నేను నేర్చుకున్నది ఆయన దగ్గరే

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు లాక్ డౌన్ లో దొరికిన టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వాటికి సంబందించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నారు నమ్రత, మహేష్. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ అన్నయ్య పుట్టిన రోజు కావడంతో తన అన్నయ్యకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సైనికులంద‌రికి రుణ‌ప‌డి ఉన్నాం

సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ లో మరింత యాక్టీవ్ గా తయారయ్యారని చెప్పొచ్చు. ఎప్పుడో ఒకప్పుడో ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే వున్నారు. కానీ ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సోషల్ డైలమా' అన్నిటికంటే భయంకరం అంటున్న మహేష్

అప్పుడప్పుడు తనకు నచ్చిన, ప్రేరణ కలిగించిన పుస్తకాలను చదవమని.. అలాగే సినిమాలు వెబ్ సిరీస్ ల గురించి కానీ మహేష్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటాడు. గతంలో 'ఎమోషనల్ ఇంటెలిజన్స్' పుస్తకం చదవమని మహేష్ సూచించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘డార్క్‌’ అనే పేరుతో తెర‌కెక్కిన జ‌ర్మ‌న్ వెబ్ సిరీస్‌ను చూశాన‌ని, ర‌చ‌న‌, దాన్ని తీసిన తీరు అత్య‌ద్భుతంగా ఉన్నాయ‌ని.. ఆ వెబ్ సిరీస్‌ను చూడాలంటూ త‌ను రెక‌మండ్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు మరో సినిమా గురించి మహేష్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ మోడ్ లో సూపర్ స్టార్

కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుమతులిచ్చినప్పటికీ భయంతో ఇప్పటివరకూ హీరోలెవరూ షూటింగ్‌లను ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే ఇప్పుడిప్పుడే యంగ్ హీరోలు ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి చిన్న చిన్నగా షూటింగ్ లను ప్రారంభిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, కింగ్ నాగార్జున ఇప్పటికే షూటింగ్ లను స్టార్ట్ చేశారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ కూడా షూటింగ్‌కు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే అది సినిమా షూటింగ్ కాదులెండి .. ఏదో వాణిజ్య ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరుగుతున్నట్టు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ స్టార్ కు సూపర్ స్టార్ బర్త్ డే శుంభాకాంక్షలు

ఈ రోజు (సెప్టెంబర్ 2 ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సినీ , రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా "వకీల్ సాబ్ " మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న "వకీల్ సాబ్ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నేనెంతో అదృష్టవంతుడిని..!

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు జరిగిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ అభిమానులు తమ అభిమాన హీరోకు ఎలాంటి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారో తెలుసు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు తమ ట్విట్టర్‌లో #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. ఇక ఈ ట్యాగ్ 60.2 మిలియన్ ట్వీట్స్‌తో 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్‌‌గా రికార్డ్ సృష్టించింది. ఇంకా టాలీవుడ్ నుండి ఎంతోమంది సెలెబ్రిటీస్ మహేష్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ రికార్డ్

బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న తన బర్త్ డే ను జరుపుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణ నేపథ్యం లో తన బర్త్ డే వేడుకలు జరపొద్దని మహేష్ బాబు అభిమానులను కోరారు. దీంతో మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో మహేష్ బాబు బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను భారీగా ట్రెండ్ చేశారు.

Team TFNవాట్సాప్
Mahesh Babu accepts Green India Challenge and nominates Jr NTR and others
సినిమా వార్తలు

ఎన్టీఆర్ కు మహేష్ ఛాలెంజ్..!

మొత్తానికి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ పుట్టినరోజు అయిపోయింది. ఈ సందర్భంగా మహేష్ కోరిక మేరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తమ తఢాకా చూపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ' సర్కారు వారి పాట' సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి గిఫ్ట్ ఇవ్వగా.. ఫ్యాన్స్ కూడా మహేష్ కు గిఫ్ట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు పుట్టిన రోజు హ్యాష్ టాగ్ ను వైరల్ చేశారు. ఈ ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో పాటు.. వరల్డ్ రికార్డుని క్రియేట్ చేసింది. ఇండియా వైడ్‌గా కాకుండా ఏకంగా వరల్డ్ ట్రెండ్స్‌లో మహేష్ బాబు బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది…

TFN Adminవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ రిలీజ్

తన పుట్టిన రోజు వేడుకలు చేయొద్దని ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచినా తన కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమా అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను కుష్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్‌తో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్లాస్మా డొనేషన్ పై మ‌హేష్ పిలుపు

కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావాలని సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మద్దతు పలుకుతూ వారు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన చేపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీస్ ఇప్పటికే స్పందించి ప్లాస్మా డొనేషన్ చేయాలని కోరారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా ప్లాస్మా డొనేషన్ పై పిలుపనిచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులకు మహేష్ విజ్ఞప్తి - అన్నిటికంటే అదే ముఖ్యం..!

కరోనా వల్ల టాలీవుడ్ హీరోలు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది హీరోలు తమ పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దని కోరగా ఇప్పుడు తాజాగా మహేష్ కూడా తన అభిమానులను అదే కోరుతున్నారు. ఈనెల 9వ తారీఖు మహేష్ పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. ఇక తమ అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కు పండగతో సమానం కదా.. ఈ నేపథ్యంలో ఇప్పటినుండే పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తన పుట్టినరోజులు వేడుకలు జరపొద్దని అభిమానులను కోరుతున్నాడు మహేష్. ఈ సందర్భంగా తన ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరోగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "రాజకుమారుడు "మూవీ 1999 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రీతి జింటా కథానాయిక. మణిశర్మ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ మీడియా లో మహేష్ బాబు సెన్సేషన్

"భరత్ అనే నేను ", "మహర్షి ", "సరిలేరు నీకెవ్వరు " వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో వర్కౌట్స్ , తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మొన్న బుక్.. నేడు వెబ్ సిరీస్..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో పిల్ల‌ల‌తో స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా పుస్త‌కాలు కూడా చ‌దువుతూ కాలక్షేపం చేస్తున్నాడు. మొన్నామధ్య 'ఎమోషనల్ ఇంటెలిజన్స్' పుస్తకం చదవమని మహేష్ సూచించిన సంగతి తెలిసిందే. 'ఎమోషనల్ ఇంటెలిజన్స్.. సైంటిఫిక్ .. సంచలనాత్మకం.. అందరూ చదవాల్సిన పుస్తకం. ఇక ఈ వారం అంతా డానియల్ గోల్ మెన్ కే కేటాయిస్తున్నా..' అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ చూడమని చెపుతున్నాడు. ‘డార్క్‌’ అనే పేరుతో తెర‌కెక్కిన జ‌ర్మ‌న్ వెబ్ సిరీస్‌ను చూశాన‌ని, ర‌చ‌న‌, దాన్ని తీసిన తీరు అత్య‌ద్భుతంగా ఉన్నాయ‌ని మ‌హేశ్ తెలిపారు. అంతే కాకుండా ఈ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెట్ డాగ్ పై మహేష్ ప్రేమ..!

ఇప్పటికే మహేష్ బాబు కూతురు సితార, కొడుకు గౌతమ్ లతో కలిసి ఆడే ఆటలు, చేసే అల్లరి ఇలా ఒకటేమిటి లాక్ డౌన్ విధించిన దగ్గర నుండి ఎన్నో క్యూట్ మూమెంట్స్ ను కెమెరాలో బంధించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది నమ్రత. ఇక బయట సైలెంట్ గా కనిపించే తమ అభిమాన హీరో ఇంట్లో ఇంత సరదాగా ఉంటాడా అని ఒకపక్క ఆశ్చర్యపోతూనే మరోపక్క తెగ కుష్ అవుతున్నారు. ఇక నమ్రత కూడా వారిని ఏమాత్రం నిరాశపరచకుండా రోజుకో పోస్ట్ చేస్తూనే వుంది. ఇక ఇప్పుడు మహేష్ కు సంబంధించి మరో ఫొటోను పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోలో మహేష్ తన పెట్ డాగ్ ను ఎంతో ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రియల్ హీరో అనిపించుకున్న మహేష్ - మేకప్ మెన్ కు బర్త్ డే విషెస్..!

కొంతమంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలనిపించుకుంటారు. ఆ వరుసలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ముందుటాడు. తన కుటుంబానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. తన చుట్టు పక్కన ఉన్న వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటాడు. తోటి న‌టీన‌టుల‌తో పాటు త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే వారికి ఎంతో మ‌ర్యాద ఇస్తుంటారు మ‌హేష్‌. తాజాగా మరోసారి అది ప్రూవ్ చేసాడు మ‌హేష్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులకు మహేష్ బాబు థ్యాంక్స్

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం ప్రారంభంలోనే "సరిలేరు నీకెవ్వరు " వంటి బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్స్ తో మహేష్ బాబు రికార్డ్స్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు మహేష్ బాబు , అభిమానులకు అనేక జాగ్రత్తలు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు ట్విట్టర్ రికార్డ్

సూపర్ హిట్ "రాజకుమారుడు " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మహేష్ బాబు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. బెస్ట్ యాక్టర్ గా మహేష్ బాబు 8 నంది , 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న మహేష్ బాబు కు మహిళాభిమానులు కూడా ఎక్కువే. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత బ్లాక్ బస్టర్ "గీత గోవిందం" మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో రూపొందే "సర్కారు వారి పాట " మూవీ షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొంటారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఈవారం 'ఎమోషనల్‌ ఇంటలిజెన్స్' కే.. !

కరోనా వల్ల ఒక రకంగా హీరో హీరోయిన్స్ కు షూటింగ్స్ లో పాల్గొనే పని లేకుండా పోయిందేమో కానీ.. మరోరకంగా మాత్రం లాక్‌డౌన్ సమయాన్ని సెలబ్రిటీలు బాగా వాడుకుంటున్నారు. నచ్చిన పనులు చేయడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, కొత్త ఇష్టమైన పనులు నేర్చుకోవడం వంటివన్నీ చేసేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.. అలర్ట్ చేస్తుంది..!

లాక్ డౌన్ నుండి ఎప్పుడైతే సడలింపులు చేశారో... అప్పటినుండి రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీనితో ఎవరికి వాళ్ళు జాగ్రతలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇక ఇప్పటికే ఎంతో మంది దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎన్నో సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరోసారి పలు సూచనలు చేశారు. నిజానికి కరోనా ప్రారంభమైనప్పటి నుండి సోషల్ మీడియా ద్వారా పలు జాగ్రత్తలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మాస్క్‌లు ధరిస్తూ, వీలైనంతగా భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే ఎన్నో వీడియోలలో ఆయన చెప్పి ఉన్నారు.

TFN Adminవాట్సాప్

షేర్