గొప్ప నటుడిగా.. మంచి తండ్రిగా.. గొప్ప భర్తగా గుర్తుపెట్టుకోవాలని నా కోరిక..!

Good Father and A Nice Husband Says Super Star Mahesh Babu - I Want Myself To Be Remembered As A Great Actor
I Want Myself To Be Remembered As A Great Actor, Good Father and A Nice Husband Says Super Star Mahesh Babu

ఇన్ని రోజులు తమ హీరో సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు మహేష్ తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. తన తర్వాత పరుశురాం దర్శకత్వంలో ఉండబోతుందని చెప్పిన చిత్రయూనిట్… నిన్న సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా నిన్న మహేష్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. మరి అవేంటో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు?
పుస్తకాలు చదువుతా. సినిమాలు ఎక్కువ చూస్తా. స్విమ్మింగ్‌ చేస్తా. పిల్లలు గౌతమ్‌, సితారతో ఆడుకుంటా. నా పెంపుడు కుక్కలతోనూ ఆటలు ఆడతా. ఆటవిడుపు కోసం నేనింకా చాలా చేస్తా.

మీ లైఫ్ స్టైల్ లో లాక్ డౌన్‌ మార్పులు తీసుకొచ్చిందా? ఎటువంటి ప్రభావం చూపింది?
నేను ఎక్కడున్నా, ఎలాగున్నా నాలైఫ్‌ స్టైల్‌ ఒకేలా ఉంటుంది. పెద్దగా మార్పులేమీ రాలేదు. నేను త్వరగా నిద్రపోతా. త్వరగా నిద్రలేస్తా.

లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో లైఫ్‌ ఎలా ఉంది?
జీవితానికి ఒక్కసారి వచ్చే అనుభవమిది. లాక్‌డౌన్‌లో కుటుంబంతో కలిసి నేను చేయలేని పనులను చేశా.

మీ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
షూటింగ్ లు త్వరలోనే ప్రారంభమవుతాయని అనుకుంటున్నాం. సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది నాకు తెలిసిన వెంటనే మొదట మీకే చెబుతా.

‘సర్కారు వారి పాట’ థీమ్‌ ఏంటి?
శక్తివంతమైన సందేశంతో కూడిన వినోదాత్మక చిత్రం.

భవిష్యత్తులో పూరి జగన్నాథ్‌తో సినిమా చేస్తారా?
తప్పకుండా చేస్తా. ఆయన వచ్చి కథ చెబుతారని నేనింకా ఎదురుచూస్తూనే ఉన్నా

మిమ్మల్ని జేమ్స్‌ బాండ్‌ సినిమాలో చూడాలని కోరిక!
నాకు అటువంటి సినిమా ఒకటి చేయాలనుంది. ఒకవేళ మీకు కుదిరితే… స్క్రిప్ట్‌ పంపించండి.

వెబ్‌ సిరీస్‌లు చూస్తారా?
ఈ మధ్యే ‘డిఫెండింగ్‌ జాకబ్‌’ చూశా. చాలా ఆసక్తికరంగా ఉంది.

మీ సీక్రెట్‌ ఒకటి చెబుతారా?
అది సీక్రెట్ అయినప్పుడు మీకు ఎలా చెప్పగలను?

మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు ?
మహేంద్ర సింగ్ ధోని, కోహ్లీ, అలాగే మై ఆల్ టైమ్ ఫేవరేట్ సచిన్’

ఎప్పుడైనా, ఎవరి మీదైనా మనసుపడ్డారా?
నాకు 26 ఏళ్ల వయసున్నప్పుడు ఓ అమ్మాయి మీద మనసుపడ్డా. తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నా. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ కూడా తనే… నమ్రత.

గౌతమ్‌, సితార… ఎవరంటే ఎక్కువ ఇష్టం?
ఇద్దరూ నాలో భాగమే. ఒకరిని ఎక్కువగా, మరొకర్ని తక్కువగా ఎలా ప్రేమించగలను

భవిష్యత్తులో గౌతమ్‌ హీరో అవుతాడా?
వాడికి హీరో అవ్వాలని ఉందనుకుంటున్నా. కాలమే సమాధానం చెబుతుంది.

మీకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?
మా నాన్న

మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటారు?
గొప్ప నటుడిగా, నా పిల్లలకు మంచి తండ్రిగా, నా భార్యకు గొప్ప భర్తగా!

మీ పిల్లలకు మీరు చేసి పెట్టగలిగే డిష్‌ ఏది?
మ్యాగీ నూడుల్స్‌!

సమంత, రష్మిక వీరిలో మీకు ఎవరు ఇష్టం ?
నేను వారిద్దరికీ చాలా ఇష్టం, ఇద్దరూ మంచి కో స్టార్స్

రాజమౌళితో మీ సినిమా ఎక్స్ పెక్ట్ చేయొచ్చా? ఎప్పుడు?
మీరు కచ్చితంగా ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు. ఆయనతో సినిమా కోసం నేను కూడా చాల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను

మీ దృష్టిలో లాక్‌డౌన్‌ తర్వాత జీవితం ఎలా ఉంటుంది?
డిఫరెంట్‌గా ఉంటుంది. మాస్కులు ధరించి, జాగ్రత్తగా ఉండాలి. మనమంతా కొత్తగా వచ్చిన ప్రస్తుత సాధారణ స్థితిని అంగీకరించక తప్పదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =