ఎన్టీఆర్ కు మహేష్ ఛాలెంజ్..!

Mahesh Babu accepts Green India Challenge and nominates Jr NTR and others

మొత్తానికి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ పుట్టినరోజు అయిపోయింది. ఈ సందర్భంగా మహేష్ కోరిక మేరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తమ తఢాకా చూపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ‘ సర్కారు వారి పాట’ సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి గిఫ్ట్ ఇవ్వగా.. ఫ్యాన్స్ కూడా మహేష్ కు గిఫ్ట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు పుట్టిన రోజు హ్యాష్ టాగ్ ను వైరల్ చేశారు. ఈ ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో పాటు.. వరల్డ్ రికార్డుని క్రియేట్ చేసింది. ఇండియా వైడ్‌గా కాకుండా ఏకంగా వరల్డ్ ట్రెండ్స్‌లో మహేష్ బాబు బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. అంతేకాదు వరల్డ్ ఫాస్టెస్ట్ ట్వీట్స్ రికార్డ్‌లు క్రియేట్ చేసుకుంటూ టోటల్‌గా ఈ ట్యాగ్ 24 గంటల్లో 60.2 మిలియన్ ట్వీట్స్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన మహేశ్ బాబు తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నా పుట్టినరోజును ఇంతకంటే బాగా సెలబ్రేట్ చేసుకోలేనేమో.. అందుకే గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించాను. ఇప్పుడు ఈ చాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో విజయ్, శృతి హాసన్ లను నామినేట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని మిమ్మల్నిందరినీ కోరుతున్నాను… పచ్చని ప్రపంచం కోసం ఒక్క అడుగు ముందుకు వేద్దాం అంటూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గీతా గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 6 =