రియల్ హీరో అనిపించుకున్న మహేష్ – మేకప్ మెన్ కు బర్త్ డే విషెస్..!

Super Star Mahesh Babu Greets Birthday Wishes To His Make Up Man On Social Media

కొంతమంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలనిపించుకుంటారు. ఆ వరుసలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ముందుటాడు. తన కుటుంబానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. తన చుట్టు పక్కన ఉన్న వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటాడు. తోటి న‌టీన‌టుల‌తో పాటు త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే వారికి ఎంతో మ‌ర్యాద ఇస్తుంటారు మ‌హేష్‌. తాజాగా మరోసారి అది ప్రూవ్ చేసాడు మ‌హేష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు మహేష్ మేకప్ మెన్ పుట్టినరోజు కావడంతో త‌న మేక‌ప్ మెన్‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపాడు మహేష్. హ్యాపీ బ‌ర్త్‌డే ప‌ట్టాభి. షూట్ మొద‌లైన‌ప్ప‌టి నుండి లాస్ట్ ట‌చ్ అప్ వ‌ర‌కు నాతో ఉండే ప‌ట్టాభి ఎల్ల‌ప్పుడు ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని మ‌హేష్ అత‌నితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ విషెస్ అందించారు.


కాగా మహేష్ తన తర్వాత సినిమా పరుశురాం తో చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ లో షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − three =