ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 92
అనుపమ పరమేశ్వరన్ షార్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్
"లూసిఫర్ "రీమేక్ లో ప్రియమణి?
ధనుష్ 'డీ43' మొదలు
'శ్రీ విష్ణు' కొత్త సినిమా ప్రారంభం
"శ్యామ్ సింగ రాయ్ " మూవీ కి భారీ సెట్ ?
'క్రాక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
రకుల్ ప్రీత్ యోగా సర్ ప్రైజ్
'కె.జి.యఫ్ 2' టీజర్ - దుమ్మురేపుతున్న రాఖీ భాయ్
జనవరి 14 వచ్చేస్తున్న 'వకీల్ సాబ్'

7 భాషల్లో రామ్ 'రెడ్' రిలీజ్

రాజస్థాన్ లో "వాలిమై " షూటింగ్
జెట్ స్పీడ్ లో నితిన్
"ఆదిపురుష్ "మూవీ అప్ డేట్
'లవ్ స్టోరీ' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
మాళవిక శర్మ మనసులో మాట
న్యూ ఇయర్ సమంత న్యూ హాబీ
గార్జియస్ వైఫ్ కు బర్త్ డే విషెస్
'క్రాక్' షూర్ షాట్ హ్యాట్రిక్ అవుతుంది
బ్రహ్మీ-కోవై సరళ కామెడీ సీన్స్
తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇక బ్రహ్మీ పక్కన కోవై సరళ ఉంటే కామెడీకి కొదువే ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో సినిమాలలో వీరి ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతం. సినిమాలో వీరు ఇద్దరు భార్య భర్తల పాత్ర పోషిస్తే ఇంక కామిడీకి కొదవ లేదు. వీరు ఇద్దరూ భార్య భర్తల క్యారక్టర్స్ లో చేసి ఎంతగానో మెప్పించారు. బ్రహ్మానందం డైలాగ్ కి కోవై సరళ రివర్స్ పంచ్ కి సరిపోతుంది.
అనుపమ పరమేశ్వరన్ షార్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్
సక్సెస్ ఫుల్ "ప్రేమమ్ " మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అనుపమ "నటసార్వభౌమ "మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. 2 మలయాళ , ఒక తమిళ మూవీ లో నటిస్తున్న అనుపమ , నిఖిల్ హీరోగా రూపొందుతున్న "18 పేజెస్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
"లూసిఫర్ "రీమేక్ లో ప్రియమణి?
"ఎవరే అతగాడు" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. "పరుత్తి వీరన్ "తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియమణి ప్రస్తుతం 4తెలుగు , 3 కన్నడ , ఒక హిందీ , ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న ప్రియమణిని , "లూసిఫర్ "మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు సంప్రదించినట్టు సమాచారం.
ధనుష్ 'డీ43' మొదలు
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో పని చేస్తున్నాడు. ప్రస్తుతం ‘కర్ణన్’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. దానితో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘జగమే తంత్రం’ సినిమా కూడా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది.
'శ్రీ విష్ణు' కొత్త సినిమా ప్రారంభం
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. తన స్థాయికి తగ్గ రేంజ్ లో మంచి కథలను చేసుకుంటూ వెళ్తున్నాడు శ్రీవిష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకటే కథ వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శ్రీవిష్ణు వరుస సినిమాలకు ఓకే చెప్తూ మంచి జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది.
"శ్యామ్ సింగ రాయ్ " మూవీ కి భారీ సెట్ ?
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన "టక్ జగదీష్ " మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో పీరియాడికల్ మూవీ “శ్యామ్ సింగరాయ్ ” లో నటిస్తున్నారు . సాయి పల్లవి , “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతిశెట్టి , మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. రాహుల్ రవీంద్రన్ , మురళీశర్మ , అభినవ్ గోమఠం ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
'క్రాక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
యదార్ధ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా క్రాక్. ఈ సినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా చూడటానికి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం..
రకుల్ ప్రీత్ యోగా సర్ ప్రైజ్
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ పలు భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. క్రిష్ మూవీ షూటింగ్ ను రకుల్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న "చెక్ "మూవీ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. తమిళ భాషలో "ఇండియన్ 2 ", "అయిలాన్ " మూవీస్ లో నటిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా రూపొందిన బాలీవుడ్ మూవీ "దే దే ప్యార్ దే " మూవీ ఘనవిజయం సాధించడంతో రకుల్ బాలీవుడ్ లో బిజీగా మారారు.
అభిమానులు , ఫాలోవర్స్ కు థ్యాంక్స్ - అల్లు అర్జున్
సక్సెస్ ఫుల్ "విజేత "(1985) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ "గంగోత్రి " మూవీ తో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ "ఆర్య " మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని స్టైలిష్ హీరోగా పేరు పొందారు. 2020 సంవత్సరం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి.
'కె.జి.యఫ్ 2' టీజర్ - దుమ్మురేపుతున్న రాఖీ భాయ్
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకు రాయుళ్లు మాత్రం ఏదో ఒక విధంగా తమ ప్రతాపం చూపిస్తూనే వున్నారు. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో తెలుసు.. అలాంటిది బాహుబలి సినిమాకే లీకులు తప్పలేదు. ఇక పవన్ నటించిన అత్తారింటి దారేది సినిమా అయితే సగానికి పైగా నెట్ లో దర్శనమిచ్చింది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందనుకోండి. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న వకీల్ సాబ్ సినిమా ఫైట్ కు సంబంధించి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఇక ఇప్పుడు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కె.జి.యఫ్ 2 కు కూడా లీకు రాయుళ్లు పెద్ద షాకే ఇచ్చారు.
జనవరి 14 వచ్చేస్తున్న 'వకీల్ సాబ్'
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

7 భాషల్లో రామ్ 'రెడ్' రిలీజ్
నేను శైలజ, చిత్రలహరి ఫేమ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా ఆయనకు మూడవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నేను శైలజతో పాటు ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చాయి. సంక్రాంతి పండుగా సందర్భంగా ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాజస్థాన్ లో "వాలిమై " షూటింగ్
బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ తల అజిత్ కుమార్ , హూమా ఖురేషి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న "వాలిమై " మూవీ లో హీరో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో కార్తీకేయ నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
జెట్ స్పీడ్ లో నితిన్
సూపర్ హిట్ "భీష్మ "తరువాత యంగ్ హీరో నితిన్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ మార్చి నెల 6 వ తేదీ రిలీజ్ కానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "చెక్ "మూవీ ఒక సాంగ్ మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ , ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు.
"ఆదిపురుష్ "మూవీ అప్ డేట్
టి -సిరీస్ , రిట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో 3D ఫార్మాట్ తో "ఆదిపురుష్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడు గా నటిస్తున్నారు. సీత పాత్రకు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ పేరు పరిశీలనలో ఉంది. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న "ఆదిపురుష్ "మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది.
'లవ్ స్టోరీ' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
2020 లో ఎలాంటి సినిమా అప్ డేట్స్ లేక కాస్త నిరాశపడిన అభిమానులకు 2021 లో మాత్రం వరుస అప్ డేట్స్ తో ఫుల్ జోష్ ను నింపుతున్నాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఇప్పటికే చాలా సినిమాల అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసారి లవ్ స్టోరీ సినిమా అప్డేట్ వచ్చేసింది.
మాళవిక శర్మ మనసులో మాట
లా స్టూడెంట్ , మోడల్ మాళవిక శర్మ "నేల టికెట్ "మూవీ లో మెడికల్ స్టూడెంట్ పాత్రతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED" మూవీ లో మాళవిక ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించారు."RED" మూవీ" సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మాళవిక పాత్రికేయులతో సమావేశమయ్యారు.
న్యూ ఇయర్ సమంత న్యూ హాబీ
స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం , ఫిట్ నెస్ లకు అధిక ప్రాధాన్యత నిస్తున్న విషయం తెలిసిందే. వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ , గార్డెనింగ్ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ లతో సమంత ఫొటో షూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. "కాతువాకుల రెండు కాదల్ "తమిళ మూవీ లో నటిస్తున్న సమంత, నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందనున్న హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గార్జియస్ వైఫ్ కు బర్త్ డే విషెస్
టాలీవడ్ యంగ్ హీరో నితిన్ - షాలిని ల పెళ్లి గత ఏడాది జరిగిన సంగతి తెలిసిందే కదా. కరోనా పరిస్థితులు ఉన్నా కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని.. కొద్దిపాటి బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తాజాగా భార్యతో కలిసి తిరుపతి కూడా వెళ్లాడు నితిన్. అంతేకాదు కాలి నడకన ఏడు కొండలు ఎక్కినట్టు.. అదికూడా 2.20 గంటల్లోనే మెట్లు ఎక్కినట్టు నితిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
'క్రాక్' షూర్ షాట్ హ్యాట్రిక్ అవుతుంది
కరోనా వలన గత కొన్నినెలలుగా పరిస్థితులు పూర్తిగా మారిన సంగతి తెలిసిందే. కొన్ని పరిశ్రమలు ఒకటి రెండు నెలల్లో కోలుకున్నా.. సినీ ఇండస్ట్రీకి మాత్రం కోలుకోడానికి కాస్త ఎక్కువ టైమే పట్టింది. ఇప్పుడిప్పుడే మళ్లీ హడావుడి మొదలైంది. అది కూడా క్రాక్ సినిమాతో. లాక్ డౌన్ తర్వాత మొదట జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాదే. క్రాక్ చిత్రం జనవరి 14న విడుదల కానుండగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అయితే పెద్ద హడావుడిగా లేకుండా క్రాక్ ప్రీ రిలీజ్ వేడుకను జరిపారు. సుమ హోస్ట్‌గా వ్యవహరించగా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.