నాకు నేనే పోటీ – రకుల్ ప్రీత్

Rakul Preet Singh Gives A Bold Statement About Competition In Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie News,Rakul Preet Singh Next Project News,Rakul Preet Singh Latest Film Updates,Rakul Preet Singh Latest Movie Details On Cards

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన మూవీ షూటింగ్ ను రకుల్ కంప్లీట్ చేశారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న “చెక్ “మూవీ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. “అయిలాన్ “, “ఇండియన్ 2 “(తమిళ ), “ఎటాక్ “, “సర్దార్ &గ్రాండ్ సన్ “, మేడే “(హిందీ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న రకుల్ మరో హిందీ మూవీ “థాంక్ గాడ్ ” లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర పరిశ్రమ లో హీరోయిన్స్ మధ్య పోటీ ఉంటుందన్న విషయం తెలిసిందే. సక్సెస్ ల పైనే హీరోయిన్ ల కెరీర్ ఆధారపడి ఉంటుంది. తెలుగు , తమిళ భాషలలో రూపొందిన “కెరటం “మూవీ తో కెరీర్ ప్రారంభించిన రకుల్ సూపర్ హిట్ “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ “మూవీ తో గుర్తింపు పొందారు. కోలీవుడ్ , టాలీవుడ్ లలో రకుల్ పలు ఆఫర్స్ అందుకున్నారు. ఇప్పుడు రకుల్ బాలీవుడ్ లో బిజీగా మారారు. హీరోయిన్స్ మధ్య పోటీ గురించి రకుల్ మాట్లాడుతూ… నంబర్ గేమ్ పై నమ్మకం లేదనీ , సినిమా హిట్ అయితే అదే తన గెలుపుగా భావిస్తాననీ , సినిమా సక్సెస్ అయితే పొంగి పోవడం , ఫెయిల్ అయితే కుంగిపోవడం వంటివి తన జీవితంలో ఉండవనీ , తనకు పోటీ ఎవరూ ఉండరనీ , తనకు తానే పోటీగా భావిస్తాననీ రకుల్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.