ఘనంగా జరిగిన సునీత వివాహం

Ram Veerapaneni and Singer Sunitha’s Marriage Takes Place On A Grand Scale In Hyderabad, Latest Telugu Movies News, Latest Tollywood News, Singer Sunitha Latest Video, Singer Sunitha Mehendi Ceremony Video, Singer Sunitha New Video, Singer Sunitha’s Mehendi Function Pictures, Sunitha, Sunitha Bride To Be Glows In Happiness, Sunitha Bride To Be Glows In Happiness; Video From Mehendi Ceremony, Sunitha Latest News, Sunitha Marriage Celebrations, Sunitha Marriage Video, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

మొత్తానికి సింగర్ సింగర్ సునీత పెళ్లి ఘనంగా జరిగింది. సునీత-డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు.. వారికి అత్యంత సన్నిహితుల మధ్య శంషాబాద్ అమ్మపల్లి సీతారాముల ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక టాలీవుడ్ నుండి కూడా కరోనా వల్ల చాలా తక్కువమందే వివాహానికి హాజరైనట్టు తెలుస్తుంది. హీరో నితిన్ భార్య శాలినితో కలిసి ఈ వివాహానికి వచ్చారు. నిర్మాత దిల్ రాజు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు కొత్త జంటకు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిసెంబర్‌లో సునీత-రామ్ వీరపనేని నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే సినీ పరిశ్రమలోని సన్నిహితులకు ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. సునీత, రామ్‌లు ఇద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి. సునీత 19 ఏళ్ళ వ‌య‌స్సులో వివాహం చేసుకోగా.. తర్వాత కొన్నేళ్లకు భ‌ర్తతో విభేదాల నేపథ్యంలో డైవ‌ర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే.

గాయ‌నిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీత ఇక తనకు ఇద్దరు పిల్లలు ఉండగా.. వారితోనే ఉంటుంది సునీత.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.