శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ పై శేఖర్ కమ్ముల సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఈ టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని.. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తాము అనుకున్న కథకు సంబంధించిన పాత్రలు రివీల్ చేశామని.. ఆడియెన్స్ కనెక్ట్ అవ్వడం చాలా హ్యపీగా ఉందన్నారు. సినిమా కూడా కనెక్ట్ అవుతుందని హోప్ వచ్చిందని.. జనాలు కూడా 100 శాతం థియేటర్లకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని… త్వరలోనే లవ్ స్టోరీని మీ ముందుకు తెస్తామని శేఖర్ కమ్ముల తెలిపారు.
కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. మరి బ్లాక్ బస్టర్ “ఫిదా” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. అంతేకాదు ఫిదాలో సాయి పల్లవితో మ్యాజిక్ క్రియేట్ చేసాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. చూద్దాం మరి నాగ చైతన్య-సాయి పల్లవిల ‘ లవ్ స్టోరీ’ ఎలా ఉంటుందో…




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: