‘డ్రైవర్ జమున’ గా టాలెంటెడ్ హీరోయిన్

Actress Aishwarya Rajesh To Play The Leading Role In Her New Movie Driver Jamuna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Aishwarya Rajesh,Heroine Aishwarya Rajesh,Aishwarya Rajesh Latest News,Aishwarya Rajesh New Movie News,Aishwarya Rajesh Upcoming Film Updates

విభిన్నమైన కథలతో.. తన నటనతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. కౌస‌ల్యాకృష్ణ‌మూర్తి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు కూడా దగ్గరైంది. ఈఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ తో అలరించిన ఐశ్వర్య ఆ సినిమాతో మరిన్ని ఛాన్స్ లు కొట్టేసింది. ప్రస్తుతం ఐశ్వ‌ర్య‌రాజేశ్ ప్ర‌స్తుతం నానితో క‌లిసి ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంలో న‌టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ‘భూమిక’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది ఐశ్వర్య రాజేష్. ఈ థిల్ల‌ర్ ఐశ్వ‌ర్య రాజేశ్‌కి 25వ సినిమా కావ‌డం విశేషం. ఈ చిత్రానికి రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తుండగా.. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాష‌‌న్ 8 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తికేయ‌న్ సంతాన‌మ్, సుధాన్ సుంద‌ర‌మ్, జ‌య‌రామన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ సైక్రియాటిస్టు పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చేస్తుంది. పి కిన్ స్లిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న డ్రైవ‌ర్ జ‌మున‌ అనే సినిమాలో నటిస్తుంది. ఇక ‘డ్రైవర్ జమున’ గా టాలెంటెడ్ హీరోయిన్ ఈ సినిమాలో ఐశ్వ‌ర్య డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించనుంది. ఎస్ఈ చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాకు గిబ్రాన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.