‘చావు కబురు చల్లగా’ టీజర్ గ్లింప్స్ రిలీజ్

Kartikeya Gummakonda and Lavanya Tripathi’s Latest Movie Chavu Kaburu Challaga Teaser Glimpse Is Out,Chaavu Kaburu Challaga Teaser: Lavanya Tripathi Chemistry With Karthikeya Gummakonda Promises Fresh Romance,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Chaavu Kaburu Challaga,Chaavu Kaburu Challaga Movie,Chaavu Kaburu Challaga Telugu Movie,Chaavu Kaburu Challaga Teaser,Chaavu Kaburu Challaga Movie Teaser,Chaavu Kaburu Challaga Telugu Movie Teaser,Chaavu Kaburu Challaga Official Teaser

ప్రస్తుతం కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ‘చావు కబురు చల్లగా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్‌, ‘బస్తీ బాలరాజు’ క్యారెక్టర్‌ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి టీజర్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో ”నువ్వు ఈ ఆసుపత్రికి సిస్టర్ వటగా.. మంచి ఉద్యోగమే ఎతుక్కున్నావ్.. మనం ప్రేమించే అమ్మాయి మనకు తప్ప మిగతా వాళ్ళందరికీ సిస్టర్ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో.. సూపర్ ఏహే” అని హీరో కార్తికేయ చెప్పే ఫన్నీ డైలాగ్ ఆకట్టుకుంటోంది. దీనికి ”నాలుగు పీకి ఇక్కడ పడుకోబెడితే నీకు కూడా నేను సిస్టర్ నే అవుతా” అంటూ కార్తికేయ‌, లావ‌ణ్య మ‌ధ్య స‌రదాగా సాగిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక కార్తికేయ – లావణ్య లను చూస్తుంటే ఇద్దరూ డీ గ్లామరస్ పాత్రలో నటిస్తున్నట్టు అర్ధమవుతుంది.

కాగా ఈసినిమాలో మురళీ శర్మ, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్,భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.