గత రెండేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. ఇంక సినిమాలు చేయను అని చెప్పిన పవన్ మొత్తానికి మనసు మార్చుకొని వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఒకదాని తర్వాత ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు వకీల్ సాబ్ సినిమాతో బిజీగా వున్నాడు పవన్. ఇక అలా ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తవుతుందో లేదో ఇలా వెంటనే క్రిష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు పవన్. పవర్ స్టార్ తన 27వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు జరుపుకోగా కరోనా వలన షూట్ కు బ్రేక్ పడింది. పవన్ బర్త్‌డే సందర్భంగా పవన్ ప్రీ లుక్ విడుదల చేసిన తర్వాత ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ లేదు.
ఇక ఈ విషయాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ సంస్థ తెలుపుతూ షూటింగ్ లొకేషన్ ఫొటోలను తమ అధికారిక ట్విట్టర్లో ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌లో డైరెక్టర్ క్రిష్, అతని టీమ్ కనిపిస్తోంది. కాగా ఇటీవలే క్రిష్ కరోనా నుండి కోలుకున్న సంగతి తెలిసిందే కదా.
#PSPK27 pic.twitter.com/wZZ6yXS0EE
— Mega Surya Production (@MegaSuryaProd) January 11, 2021
కాగా ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్రబృందం.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.