ఏడాది పూర్తి చేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’

Super Star Mahesh Babu Blockbuster Movie Sarileru Neekevvaru Completes One Year,#1YearForBlockbusterSLN: Mahesh Babu Starrer Sarileru Neekevvaru Completes One Year; Team Thanks Fans For Blockbuster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sarileru Neekevvaru,Sarileru Neekevvaru Movie,Sarileru Neekevvaru Telugu Movie,Sarileru Neekevvaru Movie Completes 1 Year,1 Year For Sarileru Neekevvaru Telugu Movie,Superstar Mahesh Babu Sarileru Neekevvaru Movie Completes 1 Year For Today

సూపర్‌స్టార్‌మహేశ్ బాబుహీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌‌ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో లేడీ అమితాబ్‌ విజయశాంతి కీల‌క‌ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లై బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రిలీజై నేటితో ఏడాది పూర్తిఅవుతున్నసంద‌ర్భంగా..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “జనవరి 11, 2020 సరిలేరు నీకెవ్వరు గుర్తు పెట్టు కోవాల్సిన రోజు, గుర్తు ఉండి పోయే రోజు. థియేటర్స్ అన్ని ఒక పండగలా ఊగిపోయిన `సంక్రాంతి`. ఆ విజువల్స్ `కొండారెడ్డి బురుజు`… `అల్లూరి సీతరామరాజు`, మహేష్ గారి నోట `చుక్క చెమట పట్టలేదు, నా చొక్కా గుండి ఊడలేదు` అనే మాటలు…`మైండ్ బ్లాక్` అంటూ ఆయన వేసిన స్టెప్పులు ఇలా ఎన్నో…`సరిలేరు నీకెవ్వరు` కరెక్ట్ గా నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా టీమ్ తరుపున తెలుగు ప్రేక్షకులకు, మహేష్ గారి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు` అన్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ వారు మాట్లాడుతూ.. “సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఏడాది పూర్తిచేసుకున్నసంద‌ర్భంగా టీమ్ అంద‌రికీ శుభాకాంక్ష‌లు“ అన్నారు.

నిర్మాత అనీల్ సుంక‌ర మాట్లాడుతూ.. “బ్లాక్ బస్టర్ కా బాప్ `సరిలేరు నీకెవ్వరు` జర్నీఎప్పటికీ గుర్తుండిపోతుంది. సరిగ్గా సంవత్సరం క్రితం మా కల నెరవేరిన రోజు ఇది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ గారి కాన్ఫిడెన్స్‌కి , ఆయ‌న‌ డెడికేష‌న్‌కి ఎప్ప‌టికి ఋణ‌ప‌డి ఉంటాను. అలాగే త‌న అంకితభావం, హార్డ్ వర్క్ తో బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి స్పెష‌ల్‌ థ్యాంక్స్‌. మాకు స‌పోర్ట్ చేసిన దిల్‌రాజుగారికి ద‌న్య‌వాదాలు. విజ‌య‌శాంతి గారికి, ర‌ష్మిక మంద‌న్న‌, డిఓపి ర‌త్న‌వేలు, సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఎగ్జిక్యూష‌న్ పార్ట్‌న‌ర్ కిషోర్ గ‌రికిపాటి, అలాగే మాకు స‌పోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి థ్యాంక్స్‌. న‌న్ను న‌మ్మి ఎల్ల‌ప్పుడూ మాకు స‌పోర్ట్ చేసిన సూప‌ర్ ఫ్యాన్స్‌కి సూప‌ర్‌ థాంక్స్‌` అన్నారు.

జీఎమ్‌బి ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు మాట్లాడుతూ.. “సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీబ్లాక్ బ‌స్ట‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఒక సంవ‌త్స‌రం పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్ష‌లు` అన్నారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ.. “మ‌రుపురాని జ‌ర్నీని ఇచ్చిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ గారికి, అనిల్ రావిపూడి గారికి అనీల్ సుంక‌ర గారికి థ్యాంక్స్‌, మ్యాజిక‌ల్ విజువ‌ల్స్ ఇచ్చిన ర‌త్న‌వేలు గారికి, నా మ్యూజిక‌ల్ టీమ్ అంద‌రికీ ద‌న్య‌వాదాలు“ అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు మాట్లాడుతూ..“సూప‌ర్‌స్టార్ మహేశ్ బాబు గారి హ్యూజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌రిలేరు నీకెవ్వ‌రులో భాగం అయినందుకు హ్యాపీగా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి, అనీల్ సుంక‌ర గారికి ద‌న్య‌వాదాలు“ అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న,లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు న‌టించిన‌ ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.