కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 80

సినిమా వార్తలు

బన్నీ కార్‌వాన్‌కు ప్రమాదం

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో 'పుష్ప' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్నట్టు పుష్ప టీం ఈరోజే ప్రకటించింది. మారేడు మిల్లి, రంపచోడవరంలలో ఇప్పటివరకూ షూటింగ్ జరుపుకుంది. ఇక షూటింగ్ పూర్తిచేసుకోని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఆయన కార్వాన్‏ కు ప్రమాదం జరిగింది. ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఒక లారీ వచ్చి ఢీకొట్టడంతో వెనుక భాగం దెబ్బతింది. అయితే కార్వాన్ లో ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'నాంది' ట్రైలర్ రిలీజ్-జీవితం ఇప్పుడే మొదలైంది

ఇప్పటి వరకూ ఎక్కువ శాతం కామెడీ సినిమాలతో అలరించిన నవ్వించిన అల్లరి నరేష్ మొదటిసారి సీరియస్ పాత్రతో మన ముందుకు రాబోతున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ పై ప్రశంసలు కురిపించిన శృతి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ కూడా ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'వాలెంటైన్స్ డే' కి రాధే శ్యామ్ టీజర్..?

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పూజా హెగ్డే తన షూట్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, పూజా హెగ్డే ప్రేర‌ణ అనే పాత్ర‌తో నటించనున్నారు. ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఉప్పెన' ట్రైలర్ రిలీజ్

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది నుండి ఎదురుచూస్తున్నాడు వైష్ణవ్ కూడా. ఫైనల్లీ థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఇంకో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, పోస్టర్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టు వైష్ణవ్ తేజ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుదల చేసిన టీజ‌ర్‌ మరింత ఆకట్టుకొని ఆ అంచనాలను రెట్టింపు చేసింది. హీరో, హీరోయిన్ నటన బావుందని.. సినిమాలో కొత్తదనం కనిపిస్తోందన్న…

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'డియర్ మేఘ' ఫస్ట్ లుక్ రిలీజ్

‘చల్ మోహనరంగ, లై’ సినిమాలతో ఆకట్టుకున్నా సరైన హిట్ అందుకోలేకపోయింది నటి మేఘ. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్స్ లు కూడా రాలేదు. అయితే ఈ గ్యాప్ లో తమిళ్ లో సినిమాలు చేసింది. వరుస అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ ఈ అమ్మడు మాత్రం ఇప్పటివరకూ సక్సెస్ టేస్ట్ మాత్రం చూడలేకపోతుంది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

గరుడవేగతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. ఈ గ్యాప్ లో పలువురి డైరెక్టర్స్ తో సినిమా ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అసలే లాక్ డౌన్ వల్ల లేట్ అయింది అనుకుంటే రాజశేఖర్ కు కూడా కరోనా రావడంతో ఇంకా లేట్ అయింది. ఇప్పుడు పూర్తి గా కోలుకున్నారు. షూటింగ్ కు రెడీ అవుతున్నారు.

TFN Adminవాట్సాప్
Doctor Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Doctor From March 26,Doctor,Doctor Movie,Doctor Film,Doctor Release Date,Sivakarthikeyan,Hero Sivakarth
రిలీజ్ అప్‌డేట్

శివ కార్తికేయన్ 'డాక్టర్' రిలీజ్ డేట్ ఫిక్స్

‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. దానితో తన సినిమాలు కూడా తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ చేస్తూనే వున్నాడు. ప్రస్తుతం కార్తికేయ పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'డాక్టర్' అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Nithiin Check Movie Trailer Public Response,Check,Check Movie,Check Telugu Movie,Check Trailer,Check Movie Trailer,Check Telugu Movie Trailer,Nithiin Check Trailer,Nithiin Check Official Trailer,Check Trailer Public Talk,Check Movie Trailer Public Ta
ట్రైలర్ & టీజర్

నితిన్ 'చెక్' మూవీ ట్రైలర్ పబ్లిక్ రెస్పాన్స్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో నితిన్ కూడా ఒకడని అతను చేసిన సినిమాలను చూస్తే చెప్పొచ్చు. ఇక గత ఏడాది భీష్మ తో హిట్ కొట్టిన నితిన్ చెక్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునేటట్లే కనిపిస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో చెక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ ను చూస్తే నితిన్ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టడం పక్కా అన్న టాక్స్ అప్పుడే వినిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

నితిన్ 'చెక్' ట్రైలర్ రిలీజ్

భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు. అందులో నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న చెక్ సినిమా ఒకటి. జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. విభిన్నమైన కథతో వస్తుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.. దానికి తోడు ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వర్క్ మోడ్ లో వరుణ్

'ముకుంద'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే మొదటి సినిమా అంత విజయం అందించలేకపోయినా రెండో సినిమా 'కంచె'తోనే జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెళ్లి పీట‌లెక్కుతున్న సుమంత్ అశ్విన్

గత ఏడాది కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.. థియేటర్స్ మూత పడ్డాయి కానీ టాలీవుడ్ లో ఎప్పుడూ జరగనన్ని పెళ్లిళ్లు మాత్రం జరిగాయి. నితిన్, అఖిల్, రానా, మెగా డాటర్ నిహారిక, దిల్ రాజు, సాహో డైరెక్టర్ సుజీత్ ఇలా చాలా మంది పెళ్లి పీటలెక్కారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ ఏం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఖిలాడి' లో రంగమ్మత్త

'రంగస్థలం'లో రంగమ్మత్త క్షణం'లో ఏసీపీ జయ భరద్వాజ్‌ గా సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది అనసూయ. ఒకవైపు బుల్లితెరపై టాప్ యాంకర్ గా యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం తను ప్రధాన పాత్రలో ' థ్యాంక్ యూ బ్రదర్' అనే సినిమాలో వస్తుంది. ‘రంగమార్తాండ’ సినిమాలో కూడా మరో మంచి పాత్రలో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఉప్పెన' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

మెగా కాంపౌండ్ నుండి వస్తున్న డెబ్యూ హీరో వైష్ణవ తేజ్. సాయి తేజ్ తమ్ముడిగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు. ఈ హీరో ఎంట్రీ ఎప్పుడో అవ్వాలి కానీ లాక్ డౌన్ వల్ల లేట్ అయిపోయింది. ఏడాది తర్వాత ఇప్పుడు ఫైనల్లీ థియేటర్స్ లోకి వస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఇక ఇప్పటికే ఈ సినిమా పాటలతో సినిమాపై అంచనాలు పెంచగా.. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగా '13' సెంటిమెంట్

నిజజీవితంలో సెంటి మెంట్స్ ఎలా ఉంటాయో.. వాటిని మనం ఎలా తప్పకుండా ఆచరిస్తామో.. సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు నూటికి 90 శాతం మంది ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. అలానే డైరెక్టర్స్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

ఆది 'శశి' - మారిన రిలీజ్ డేట్

శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా 'శశి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఒకేఒక లోకం నువ్వు అనే సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'నారప్ప' షూటింగ్ పూర్తి

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌, పోస్ట‌ర్లకు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించిన సంగతి కూడా విదితమే. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే 14 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'పాగల్' ఫస్ట్ లుక్ రిలీజ్ - రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ సినిమా అంగమలై డైరీస్‌ను తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్‌’గా తెరకెక్కించిన విశ్వక్‌ సేన్‌.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ఇక గత ఏడాది శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా చేసి దానితో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో 'పాగల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Central Government Gives Approval For Hundred Percent Occupancy In Theatres,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Central Government,Theatres,Increase Theatre Occupancy,Cinema H
సినిమా వార్తలు

100 శాతం ఆక్యుపెన్సీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

సినీ పరిశ్రమకు మరో గుడ్ న్యూస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. థియేటర్స్ తెరిచినా ఇప్పటివరకూ 50 శాతం అక్యుపెన్సీ తో నడిపించాలనే షరతులు ఉన్నాయి. ఆ మధ్య సంక్రాంతి పండుగ సీజ‌న్‌లో నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ కేంద్ర ప్ర‌భుత్వానికి పూర్తి సీటింగ్ కెపాసిటీ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేసినా, రాష్ట్ర ముఖ్య‌మంత్రులు ప్రత్యేకంగా వంద శాతం థియేట‌ర్స్‌ను ఓపెన్ చేసుకోమ‌ని చెప్పినా కేంద్ర ప్ర‌భుత్వం ఒప్పుకోలేదు. ఇక ఇటీవల మరికొద్దిగా ఎక్కువ శాతం అక్యూపెన్సీ ని పెంచుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఎంత శాతం అనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయంపై కూడా క్లారిటీ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సుల్తాన్' టీజర్ రిలీజ్

‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్‌ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. రెమో ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా 'సుల్తాన్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది .

TFN Adminవాట్సాప్

షేర్