కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 81

రిలీజ్ అప్‌డేట్

విశాల్ 'చక్ర' రిలీజ్ డేట్ ఫిక్స్

విశాల్ హీరోగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా 'చక్ర'. బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో ఫుల్ టెక్నికల్ విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'నరుడి బ్రతుకు నటన' షూటింగ్ ప్రారంభం

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. లాక్ డౌన్ లోనే ఈ సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు 'కృష్ణ అండ్ హిజ్ లీల' డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన విమల్ కృష్ణ దర్శకునిగా పరిచయం సిద్దు, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా మరొక సినిమా రూపొందుతుంది. 'నరుడి బ్రతుకు నటన' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఖిలాడి' లో మలయాళ హీరో

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేసిన వీడియో గ్లిమ్స్‌కు సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆచార్య' లా మారిన వార్నర్

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. మహర్షి లా మారాడు, బంటు పాత్రలో దూరాడు, ప్రభాస్ బాహుబలి అయ్యాడు.. ఎన్టీఆర్ లా మారాడు.. ఇక ఇప్పుడు ఏకంగా ఆచార్య లా మారాడు. ఇటీవలే చిరు నటిస్తున్న ఆచార్య సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఫేస్ యాప్ ద్వారా టీజర్ లోని చిరు ప్లేస్ లో తన పేస్ పెట్టి వీడియో చేసి పోస్ట్ చేశాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TFN Adminవాట్సాప్
Director Boyapati Srinu and Balakrishna New Movie BB3 Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Balakrishna,Hero Balakrishna,Actor Balakrishna,Boyapati Srinu,
సాంగ్

బాలయ్య - బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా కన్ఫామ్ చేయని ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఈమధ్యనే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టగా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఈ నెల రెండో వారంనుండి చివరి షెడ్యూల్‌ ప్రారంభించనున్నటు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రాగా.. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ పెద్దగా ఇవ్వలేదు బోయపాటి.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'సలార్' షూటింగ్ ప్రారంభం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ కూడా ఈ రోజు నుండి మొదలైంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో తెరకెక్కించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. వార్తల ప్రకారమే షూటింగ్ శుక్ర‌వారం గోదావ‌రిఖ‌నిలో మొదలైంది. ఇందు కోసం గోదావ‌రిఖ‌ని స‌మీపంలోని రామ‌గుండం చేరుకుంది చిత్ర బృందం. అంతేకాదు హీరో ప్ర‌భాస్ అక్క‌డి పోలీస్ అధికారిని క‌లిశారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో సంద‌డి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శృతి హాసన్ బెస్ట్ జోడి..?

క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన‌ శృతి హాస‌న్ తండ్రికి ‌తగ్గ త‌న‌య‌గా పేరును సంపాదించుకుంది. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట వరుస ప్లాప్స్ తో కాస్త ఇబ్బంది పడ్డ శృతి ఆ తర్వాత చాలా మంది హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న గ‌బ్బ‌ర్ సింగ్‌ లో నటించి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఆ త‌రువాత వీరిద్ద‌రి కాంబోలో కాట‌మ‌రాయుడు రాగా.. ఇప్పుడు వ‌కీల్ సాబ్‌లోనూ ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రుతీ న‌టిస్తోంది. వరుస ప్లాప్స్ లో ఉన్న రవితేజకు బలుపుతో మంచి హిట్ కొట్టింది. అల్లు అర్జున్ తో రేసుగుర్రం…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'చెక్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. ఇక ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒకటి రంగ్ దే కాగా.. మరొకటి చెక్. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'చెక్'. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 19న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఖిలాడి' లో యాక్షన్ కింగ్ 'అర్జున్'

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా మరోసారి హుషారైన పాత్రలో రవితేజ నటిస్తున్నట్టు కనిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
Adivi Sesh Major Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh,Hero Adivi Sesh,Actor Adivi Sesh,Major,Major Movie,Major Film,Major Telugu Movie,M
రిలీజ్ అప్‌డేట్

'మేజర్' రిలీజ్ డేట్ ఫిక్స్

అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవల అడవి శేష్ పుట్టిన రోజు సందర్భంగా మేజర్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన మూవీ మేకర్స్.. తాజాగా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మహేష్ బాబు, అడవి శేష్ ట్విట్ చేశారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్' ట్రైలర్ రిలీజ్

ర‌మేష్ రాప‌ర్తి దర్శకత్వంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ‌, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో 'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్' టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అన్నిపనులు పూర్తి చేసుకొని ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చిది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ తో కలిసి మీసం తిప్పుతున్న రానా

సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళంలో సూపర్‌ హిట్ అయిన 'అయ్యప్పనుమ్‌ కోశియనుమ్‌' సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో రానా నటిస్తున్న సంగతి కూడా విదితమే. బిజు మీనన్‌ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్‌ చేస్తుండగా.. రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. అక్కడ వేసిన…

TFN Adminవాట్సాప్
F3 Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,F3 Release Date Locked,F3 Movie Release Date Confirmed,Director Anil Ravipudi,Venkatesh,Varun Tej,Tamannaah
రిలీజ్ అప్‌డేట్

F3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్. వెంకటేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ సినిమాలో మూడో హీరో కూడా ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చాయి . కానీ మూడో స్టార్ హీరోగా ఎవరూ చేయడం లేదని, అసలు…

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

విరాటపర్వం రిలీజ్ డేట్ ఫిక్స్

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా 'విరాట‌ప‌ర్వం'. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్" అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న 'విరాట‌ప‌ర్వం'ను ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చెన్నైలో స్టార్ హీరోయిన్ సమంత

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వర్కౌట్ , గార్డెనింగ్ వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు."కాతువాకుల రెండు కాదల్ "తమిళ మూవీ లో నటిస్తున్న సమంత , నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషల లో రూపొందనున్న హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'పుష్ప' రిలీజ్ డేట్ ఫిక్స్

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఇప్పటివరకూ ఆర్య, ఆర్య2 రాగా.. ఇప్పుడు మూడోసారి 'పుష్ప' సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో లారీ డ్రైవర్‌గా కనబడనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూలు తరువాత హైదరాబాద్.. దాని తరువాత కేరళలో మరో షెడ్యూలు జరుపుకోనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అఫీషియల్.. 'సలార్' లో 'శృతి'

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలను తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో తెరకెక్కించనున్నట్టు.. ఇప్పటికే కోల్ మైన్ వద్ద ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థియేటర్స్ లో అధిక ఆక్యుపెన్సీ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్

2020 లో కరోనా వల్ల అన్ని పరిశ్రమలు దాదాపు చాలా వరకూ నష్టపోయిన సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా సినీ పరిశ్రమ. చాలా పరిశ్రమలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ వుంది కానీ సినీ పరిశ్రమకు పరిస్థితి వేరు. షూటింగ్ లు జరిగితేనే సినీ కార్మికులకు ఆదాయం. మరి లాక్ డౌన్ లో సినీ పరిశ్రమ ఎలాంటి గడ్డుకాలం చూసిందో మనం కూడా చూసాం. షూటింగ్ లు లేవు.. మరో పక్క థియేటర్స్ మొత్తం మూత పడ్డాయి.. వేల కోట్లలో బిజినెస్ ఆగిపోయింది. ఎలాగొలా ఇప్పుడిప్పుడే ఆ నష్టం నుండి తేరుకుంటుంది. గత రెండు నెలల నుండి షూటింగ్ లు జరుగుతున్నాయి.. సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ప్రభాస్ చేతుల మీదుగా 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' టీజర్

చిలసౌ సినిమా తర్వాత సుశాంత్ హీరోగా మళ్లీ ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకు మంచి పేరే వచ్చిందనుకోండి. ఇక ప్రస్తుతం ఎస్‌ దర్శన్‌ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' 'నో పార్కింగ్' అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల చాలా లేట్ అయిపోయింది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"గని " రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , బ్లూ వాటర్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "గని " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ మూవీ “దబంగ్ “ఫేమ్ సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా ఉపేంద్ర , సునీల్ శెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లోని తన క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ పొందారు.

Team TFNవాట్సాప్

షేర్