
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 52


నేను నా జోన్ లో - రవితేజ

షూట్ కు రెడీ అవుతున్న 'పవన్'

'#D43' జులై నుండి ఫైనల్ షెడ్యూల్

'7 డేస్ 6 నైట్స్' షూటింగ్ ప్రారంభం

" మజిలీ" మేకర్స్ తో వైష్ణవ్ తేజ్ ?

'గుడ్ లక్ సఖి' ఫ్యాన్స్ కు స్పెషల్ షో

షూటింగ్స్ తో పూజాహెగ్డే బిజీ

సోషల్ మీడియా కు దూరంగా

దుబాయ్ కు 'ఖిలాడి' టీమ్

'శ్రీదేవి సోడా సెంటర్' డబ్బింగ్ కంప్లీట్

'వసంత కోకిల' టీజర్ రిలీజ్

శక్తిమంతమైన కథల కై ఎదురుచూస్తున్నా - రాశీఖన్నా

లేడీ ఓరియెంటెడ్ మూవీ లో ప్రియమణి

సైన్స్ ఫిక్షన్ మూవీ లో తాప్సీ

'ఖిలాడి' మోస్ట్ స్టైలీష్ మూవీ

ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'రాధేశ్యామ్'

తమన్నా లేటెస్ట్ స్టన్నింగ్ లుక్
సక్సెస్ ఫుల్ "శ్రీ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ తో పాటు తన అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్ తో పలుసూపర్ హిట్ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

నేను నా జోన్ లో - రవితేజ
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.” ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఒక సాంగ్ , ఒక యాక్షన్ సీన్ బ్యాలెన్స్ ఉన్నాయి.

రూమర్స్ నమ్మొద్దు.. నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ
బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ భారీ రేంజ్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్స్ విషయంలో పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. శృతి హాసన్, త్రిష లాంటి హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. ఈనేపథ్యంలో బాలయ్య సరసన నటించే అవకాశం మెహ్రీన్ కు దక్కిందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈవార్తలపై స్పందించిన మెహ్రీన్ తాజాగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

షూట్ కు రెడీ అవుతున్న 'పవన్'
ఇన్ని రోజులు కరోనా వల్ల రెస్ట్ తీసుకున్న తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సెట్స్ పైకి సందడి చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ చేతిలో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో రానా-పవన్ కాంబినేషన్ లో వస్తున్న మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా. ఈరెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ అందరూ షూటింగ్ లు స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో పవన్ కూడా రెడీ అవుతున్నాడు.

'#D43' జులై నుండి ఫైనల్ షెడ్యూల్
కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనేతేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమా చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు ధనుష్. ఇప్పటికే ధనుష్ నటించిన కర్ణన్, జగమే తంత్రం సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి సందడి చేశాయి. ఇప్పుడు కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొదలై చివరి దశకు కూడా చేరుకుంది. లాక్ డౌన్ లేకపోతే షూటింగ్ పూర్తి చేసుకొని ఉండేది. ఇక ఇప్పుడు అందరూ షూటింగ్ లు మొదలుపెడుతుండటంతో ధనుష్ కూడా రంగంలోకి దిగనున్నాను. ఈసినిమాఫైనల్ షెడ్యూల్ ను జులై నుండి ప్రారంభించనున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు.

'7 డేస్ 6 నైట్స్' షూటింగ్ ప్రారంభం
ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే డర్టీ హరీ అనే రొమాంటిక్ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. ఆసినిమా మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇప్పుడు మరో డిఫరెంట్ యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో 7 డేస్… 6 నైట్స్ అనే సినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు.

"అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి "టీమ్ కు ప్రభాస్ ఆల్ ది బెస్ట్
4 దశాబ్దాలకు పైగా అలీ తన కామెడీ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని మూవీస్ లో హీరోగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అలీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీనియర్ కమెడియన్ అలీ ఇప్పుడు నిర్మాతగా మారారు. అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీ హీరోగా సోషల్ మీడియాలో ఆకతాయిల వలన అమాయకులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే కాన్సెప్ట్ తో "అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి " మూవీ రూపొందింది. ఈ మూవీ లో మౌర్యాని , మంజుభార్గవి , పవిత్ర లోకేశ్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

" మజిలీ" మేకర్స్ తో వైష్ణవ్ తేజ్ ?
హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను వైష్ణవ్ తేజ్ కంప్లీట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక మూవీ కి , ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ బ్యానర్ లో ఒక మూవీ కి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయంతెలిసిందే .

'గుడ్ లక్ సఖి' ఫ్యాన్స్ కు స్పెషల్ షో
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి. జూన్ 3న భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇటీవలే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు రాగా వాటికి క్లారిటీ కూడా ఇచ్చింది చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఫ్యాన్స్ కు ఒక బంపరాఫర్ ఇచ్చారు మేకర్స్. యాభై మంది అభిమానులను ఎంపిక చేసి వారికి స్పెషల్ షో వేసి ఈ సినిమాను చూపించబోతున్నారట. ఎప్పుడు అభిమనులకు ఈ చిత్రం చూపించబోతున్నారో ఇంకా…

షూటింగ్స్ తో పూజాహెగ్డే బిజీ
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ " తమిళ మూవీ లో ఎంపిక అయినవిషయం తెలిసిందే.

సోషల్ మీడియా కు దూరంగా
సక్సెస్ ఫుల్ రైటర్ గా కొనసాగుతున్న కొరటాల శివ సూపర్ హిట్ "మిర్చి "మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "శ్రీమంతుడు ", "జనతా గ్యారేజ్ ", "భరత్ అనే నేను " వంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తెరకెక్కించి శివ అలరించారు. శివ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న "ఆచార్య " మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. "ఆచార్య "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "ఆచార్య " మూవీ తరువాత శివ "#NTR30 "మూవీ కి దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే.

దుబాయ్ కు 'ఖిలాడి' టీమ్
క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీనికితోడు దుబాయ్ లో రవితేజ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించి చిన్న గ్లింప్స్ ను ఇటీవల రిలీజ్ చేయగా.. దీంతో ఈసినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కనున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 80 శాతం టాకీపార్ట్ పూర్తయిన చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జూలై రెండో వారం నుంచి కొంత భాగాన్ని…

'శ్రీదేవి సోడా సెంటర్' డబ్బింగ్ కంప్లీట్
పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే సుధీర్‌బాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర యూనిట్ నుండి గ్లింప్స్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాడు సుధీర్. ఇక తాజాగా ఈసినిమా డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నాడు సుధీర్ బాబు. ఈవిషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తను డబ్బింగ్ చెబుతున్న ఒక చిన్న వీడియోను షేర్ చేస్తూ డబ్బింగ్ కంప్లీట్ చేసినట్టు తెలిపాడు.

'వసంత కోకిల' టీజర్ రిలీజ్
తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో బాబి సింహా కూడా ఒకరు. పలు తమిళ మూవీస్ లో ప్రతినాయకుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో కూాడా పలు సినిమాల్లో నటించాడు. రన్, ఏదైనా జరగొచ్చు, డిస్కో రాజా మూవీస్ లో నటించాడు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు.

శక్తిమంతమైన కథల కై ఎదురుచూస్తున్నా - రాశీఖన్నా
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయిన రాశీఖన్నా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్ మూవీ లో ప్రియమణి
"ఎవరే అతగాడు "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి "కంగలై ఖైదు సేయ్ "మూవీ తో కోలీవుడ్ , "సత్యం "మూవీ తో మలయాళ చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. "పరుత్తి వీరన్ "తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఆది సినిమాలో సునీల్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ లో ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించాడు. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రం ఒకటి రెండు హిట్స్ అందుకున్నా ఆతరువాత మాత్రం వరుస పరాజయాలే అందుకున్నాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకశాలు అందుకుంటున్నాడు. హీరో, కమెడీ పాత్రలతో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.

సైన్స్ ఫిక్షన్ మూవీ లో తాప్సీ
“ఝుమ్మంది నాదం”మూవీ తో టాలీవుడ్ కు “ఆడుకాలం” మూవీ తో కోలీవుడ్ కు తాప్సీ పన్ను పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చష్మే బద్దూర్ “మూవీ తో బాలీవుడ్ లో తాప్సీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టి బాలీవుడ్‌లో “పింక్”, “బద్లా”, “థప్పడ్”, “నామ్ షబానా”, “సాండ్ కీ ఆంఖ్”, “మిషన్ మంగళ్” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను అలరించారు.

'ఖిలాడి' మోస్ట్ స్టైలీష్ మూవీ
'నువ్విలా' చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన హీరో హవీష్. ఆ తరువాత 'జీనియస్' మరియు 'రామ్ లీల' అనే చిత్రాలలో నటించినా అవి కూడా నిరాశనే మిగిల్చాయి. ఆ తరువాత 'సెవెన్' అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చాడు. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పెట్టి 'రాక్షసుడు' సినిమా నిర్మించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని కమర్షిల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు రవితేజతో ఖిలాడి సినిమాతో వస్తున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నహవీష్ ఖిలాడి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశాడు.

ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'రాధేశ్యామ్'
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలసిందే. ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో రాధేశ్యామ్ సినిమా దాదాపు పూర్తయిపోయినట్టే. కరోనా, లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి రిలీజ్ అయ్యేది కానీ కొద్ది రోజులు మాత్రమే పెండింగ్ ఉండగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకూ ఆ షూట్ పెండింగ్ లో పడిపోయింది. ఇన్ని రోజుల గ్యాప్ తరువాత ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. హైద్రాబాద్ లో నేడు ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను మొదలు పెట్టారు. తొందరగా షూటింగ్ ను పూర్తిచేసి రిలీజ్ కు సిద్దం చేయాలని చూస్తున్నారట…