‘నువ్విలా’ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన హీరో హవీష్. ఆ తరువాత ‘జీనియస్’ మరియు ‘రామ్ లీల’ అనే చిత్రాలలో నటించినా అవి కూడా నిరాశనే మిగిల్చాయి. ఆ తరువాత ‘సెవెన్’ అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చాడు. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పెట్టి ‘రాక్షసుడు’ సినిమా నిర్మించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని కమర్షిల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు రవితేజతో ఖిలాడి సినిమాతో వస్తున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నహవీష్ ఖిలాడి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఈసినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా గురించి హవీష్ మాట్లాడుతూ.. రవితేజ గత పదేళ్లుగా నాకు తెలుసు.. స్టార్ హీరోలా కాకుండా చాలా నార్మల్ గా ఉంటారు.. ఇప్పటివరకూ రవితేజ చేసిన సినిమాల్లో ఇదే మోస్ట్ స్టైలీష్ సినిమా అవుతుందని.. మరో ఇరవై రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది త్వరలోనే మిగిలిన షూట్ ను పూర్తి చేస్తామని తెలిపారు.
కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
ఇక జులై రెండో వారం నుండి ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేసి కంప్లీట్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ టీజర్ భారీగా అంచనాలను నెలకొల్పాయి. ‘క్రాక్’తో భారీ హిట్ అందుకున్న రవితేజకి ‘ఖిలాడి’ ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: