సక్సెస్ ఫుల్ రైటర్ గా కొనసాగుతున్న కొరటాల శివ సూపర్ హిట్ “మిర్చి “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “శ్రీమంతుడు “, “జనతా గ్యారేజ్ “, “భరత్ అనే నేను ” వంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తెరకెక్కించి శివ అలరించారు. శివ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న “ఆచార్య ” మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. “ఆచార్య “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. “ఆచార్య ” మూవీ తరువాత శివ “#NTR30 “మూవీ కి దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ తాను సోషల్ మీడియాకి దూరమవుతున్నట్టు ప్రకటించారు . ఇప్పటి వరకు ఎన్నో విషయాల్ని సామాజిక మాధ్యమాల వేదికగా మీతో పంచుకున్నాననీ , వాటి నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైందనీ , .మన మీడియా మిత్రుల ద్వారా మీతో ఎప్పుడూ టచ్‌లో ఉంటాననీ , మాధ్యమం మారుతుంది కానీ మన అనుబంధం కాదనీ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తన మనసులోని మాటని . అభిమానులతో ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: