
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 40


హిందీలో ఆ ఛాన్స్ రానందుకు ఫీల్ అయ్యా..!

"ఏజెంట్ " మూవీ అప్ డేట్

నివేదా థామస్ బర్త్ డే స్టైలిష్ లుక్

తాప్సీ లేటెస్ట్ లుక్

రియల్ డాక్టర్ గా కనిపిస్తా - రకుల్ ప్రీత్

డబల్ ఎనర్జీతో అఖిల్ 'ఏజెంట్'

నిధి అగర్వాల్ వైట్ శారీ లుక్

ముంబై లో పూజాహెగ్డే డ్రీమ్ హౌస్

PVR తో RRR డీల్..!

7 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నాగశౌర్య

క్యాథరిన్ బ్యూటీఫుల్ లుక్

లైన్ క్లియర్ చేసుకున్న 'ఇండియన్ 2' మేకర్స్

"స్కైలాబ్ " మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

'మంచి రోజులు వచ్చాయి' కి అతిథిగా గోపీచంద్

"దృశ్యం 2 " మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్
శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ "దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ దృశ్యం 2″ మూవీ రూపొందింది.

హిందీలో ఆ ఛాన్స్ రానందుకు ఫీల్ అయ్యా..!
తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సూపర్ హిట్టయింది. ఈ ఒక్క సినిమాతో కార్తికేయ, పాయల్, డైరెక్టర్ అజయ్ భూపతి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతంముగ్గురు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.

"ఏజెంట్ " మూవీ అప్ డేట్
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

నివేదా థామస్ బర్త్ డే స్టైలిష్ లుక్
పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన నివేదా సూపర్ హిట్ “జంటిల్ మన్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నిన్నుకోరి”, “జై లవ కుశ “, “118 “, “బ్రోచేవారెవరురా”, “వకీల్ సాబ్” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నివేదా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేదా ప్రస్తుతం "మీట్ క్యూట్ ", "శాకిని డాకిని " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

తాప్సీ లేటెస్ట్ లుక్
తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం“శభాష్ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. ఒక సైన్స్ ఫిక్షన్ తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అవుట్ సైడర్ ఫిల్మ్స్’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి జీ స్టూడియోస్‌తో కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని తాప్సీ నటిస్తూ నిర్మిస్తున్నారు.

ఓటీటీ రిలీజ్ కు సిద్దమైన 'రిపబ్లిక్'
మెగా హీరో సాయి తేజ్ వరుసగా హిట్స్ ను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఉన్న సాయ్ తేజ్ చిత్రలహరి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఆ తరువాత నుండి వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో హిట్ అందుకున్న సాయి తేజ్.. ఈ ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి హిట్ ను సొంతం చేసుకున్నాడు. దేవ కట్టా దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. నిజానికి రిపబ్లిక్ సినిమా విడుదల సమయానికి బైక్ యాక్సిడెంట్‌కు గురైన సాయిధరమ్ తేజ్ ఆస్పత్రిలోనే ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయకుండా సినిమా…

రియల్ డాక్టర్ గా కనిపిస్తా - రకుల్ ప్రీత్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్", అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న రెండు ప్రాజెక్ట్స్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

డబల్ ఎనర్జీతో అఖిల్ 'ఏజెంట్'
మొత్తానికి అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్ ఇన్నేళ్లకు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తన ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాపై పెట్టుకోగా.. ఈసినిమా ఆ ఆశలను నేరవేర్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయినట్టు తెలుస్తుంది. దీంతో ఇన్నాళ్లూ ఎంతో ఆశగా ఎదురుచూసిన హిట్ దక్కడంతో అఖిల్ కు ఫుల్ ఎనర్జీ వచ్చినట్టైంది.

నిధి అగర్వాల్ వైట్ శారీ లుక్
"సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.నిధి ప్రస్తుతం “హీరో ”, “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.“భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన ఇస్మార్ట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నిధి టాలీవుడ్ , కోలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా మారారు. కోలీవుడ్ స్టార్ హీరోస్ నిధి తో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. కోలీవుడ్ లో నిధికి మంచి ఛాన్సులు వస్తున్నాయి.

ముంబై లో పూజాహెగ్డే డ్రీమ్ హౌస్
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
అల్లు అర్జున్ చేతుల మీదుగా "పుష్పక విమానం" మూవీ ట్రైలర్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సమర్పణ లో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్ , టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , శాన్వీ మేఘన , గీత సైనీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పుష్పక విమానం" మూవీ నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. సునీల్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

PVR తో RRR డీల్..!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇక గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ను రాజమౌళి భారీగా ప్లాన్ చేస్తున్నారు అంటూ వస్తున్న వార్తలను బట్టి చూస్తే అది నిజమనే అనిపిస్తుంది. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో.. ఇంకా రెండునెలలు మాత్రమే టైమ్ ఉండటంతో మంచి హైప్ ను క్రియేట్ చేయడానికి మేకర్స్ రెడీ అయినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే.. అక్టోబర్ 29న ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనివిని ఎరుగనిది చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఈ మూవీ టీం ట్విట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఫ్యాన్స్…

7 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నాగశౌర్య
హీరో నాగశౌర్య కథానాయకుడిగా రూపొందిన "వరుడు కావలెను " ఈరోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. నాగశౌర్య కథానాయకుడిగా "లక్ష్య ", అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ సెట్స్ పైన ఉన్నాయి. "పోలీసు వారి హెచ్చరిక", "నారి నారి నడుమ మురారి ", "ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి" మూవీస్ కు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

క్యాథరిన్ బ్యూటీఫుల్ లుక్
“శంకర్ ఐ పి ఎస్ “(2010 ) కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన క్యాథరిన్ “ది థ్రిల్లర్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు ,”చమ్మక్ ఛలో “మూవీ తో టాలీవుడ్ , “మద్రాస్ “మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“ఇద్దరమ్మాయిలతో “, “పైసా “, “రుద్రమదేవి “, “సరైనోడు “, “నేనే రాజు నేనే మంత్రి “వంటి సూపర్ హిట్ మూవీస్ లో కేథరిన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సాంగ్ చిత్రీకరణ లో "తీస్ మార్ ఖాన్ "
యంగ్ హీరో ఆది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఆది సాయికుమార్ కథానాయకుడిగా “జంగిల్ “, “కిరాతక “, “అమరన్” , “బ్లాక్ “, తీస్ మార్ ఖాన్ “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “తీస్ మార్ ఖాన్ ” మూవీ తెరకెక్కుతుంది. పాయల్ రాజ్ పుత్ కథానాయిక. సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

లైన్ క్లియర్ చేసుకున్న 'ఇండియన్ 2' మేకర్స్
శంకర్ - లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ మధ్య ఇటీవల ఇండియన్ 2 సినిమా గురించి వచ్చిన వివాదం గుర్తుండే ఉంటుంది కదా. నిజానికి ఈ సినిమాకు మొదటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇలా షూటింగ్ మొదలైంది అనుకునే లోపు క్రేన్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తరువాత కరోనా రావడం.. మధ్యలో కమల్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో మధ్యలో మేకప్ వల్ల వచ్చిన స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలా ఒకదాని తరువాత ఒకటి అడ్డంకులు రావడంతో మొత్తానికే ఈసినిమా ఆగిపోయింది. ఇక ఈసినిమా గురించి అందరూ మర్చిపోయారు.

"స్కైలాబ్ " మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్కైలాబ్ ఆధారంగా పీరియాడికల్ మూవీ “స్కైలాబ్ “తెరకెక్కింది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. NASA ఫస్ట్ స్పేస్ స్టేషన్ స్కైలాబ్ (1979) కూలిపోయి భూమి సర్వ నాశనం అయిపోతుందని వార్తలు వచ్చాయి . ప్రజలంతా ఏం జరుగుతుందోనని ఆసక్తి గా ఎదురు చుసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలోని గౌరి, ఆనంద్, రామారావు జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే నేపథ్యం లో “స్కైలాబ్ ” మూవీని దర్శకుడు వినోదాత్మంగా తెరకెక్కించారు.

అంచనాలు అందుకోలేకపోయా.. సారీ చెప్పిన అజయ్ భూపతి..!
అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్-సిద్దార్థ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ మహాసముద్రం. అజయ్ భూపతి తీసిన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తో సంచలన విజయం సాధించడంతో రెండో సినిమా అయిన మహా సముద్రంపై మొదటినుండి అంచనాలు పెట్టేసుకున్నారు అందరూ. దానికి తోడు ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ లు కూడా అదే రేంజ్ లో ఉండటంతో పక్కా హిట్ కొడతాడు అనుకున్నారు. కానీ మొదటి సినిమా హిట్ కొట్టిన అజయ్ భూపతి… రెండో సినిమా వచ్చే సరికి కాస్త తడబడ్డాడు. కథలో బలం లేకపోవడం, సన్నివేశాలు ఆసక్తిని కలిగించకపోవడంతో.. అందరినీ నిరాశ పరిచింది.
అల్లు అర్జున్ పై బాలీవుడ్ నిర్మాత , దర్శకుల ప్రశంసలు
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ పలు విధాల నష్టపోయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన్న అన్ని భాషల చిత్రాలు విడుదల వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకుంటుంది . "వరుడు కావలెను " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ .. కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందనీ , ఇప్పుడిప్పుడే మహమ్మారి ప్రభావం తగ్గడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు థియేటర్లోకి వస్తున్నారనీ , ఇప్పటి నుంచి భారత సినీ పరిశ్రమలో అన్ని పెద్ద పెద్ద సినిమాలే రాబోతున్నాయనీ , అన్ని ఇండస్ట్రీల వారు బాగుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

'మంచి రోజులు వచ్చాయి' కి అతిథిగా గోపీచంద్
మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. ఈసినిమా దీపావళికి రిలీజ్ కానుంది. దీనిలో భాగంగానే రీసెంట్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో సినిమాపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ప్రమోషన్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు చిత్రయూనిట్ 29 అక్టోబర్ సాయంత్రం 6 గం.ల నుంచి జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో హైదరాబాద్ వేదికగా ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు మ్యాచో స్టార్ గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.