ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ , విశాఖపట్నం పోర్ట్ లలో హీరో అఖిల్ పై యాక్షన్ ఎపిసోడ్లను దర్శకుడు చిత్రీకరించారు. హైదరాబాద్ ఆర్ ఎఫ్ సీలో నూ కొన్ని కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.తాజాగా బుడాపెస్ట్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో మమ్ముట్టి పై కీలక సన్నివేశాలు దర్శకుడు తెరకెక్కించారు. ఆ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. విదేశీ స్టంట్ మెన్‌లతో ఓ యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్‌ను అఖిల్ తో దర్శకుడు తెరకెక్కించినట్టు సమాచారం. నిర్మాత అనిల్ సుంకరతో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మూవీకి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























