మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇక గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ను రాజమౌళి భారీగా ప్లాన్ చేస్తున్నారు అంటూ వస్తున్న వార్తలను బట్టి చూస్తే అది నిజమనే అనిపిస్తుంది. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో.. ఇంకా రెండునెలలు మాత్రమే టైమ్ ఉండటంతో మంచి హైప్ ను క్రియేట్ చేయడానికి మేకర్స్ రెడీ అయినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే.. అక్టోబర్ 29న ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనివిని ఎరుగనిది చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఈ మూవీ టీం ట్విట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఫ్యాన్స్ ఏ అప్ డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆ అప్ డేట్ రానే వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీవీఆర్ సంస్థతో ట్రిపుల్ ఆర్ డీల్ కుదుర్చుకొని ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది ఆర్ఆర్ఆర్. దీనిలో భాగంగానే పీవీఆర్ సినిమాస్‌కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‌ల పేరు PVRRR గా మార్పు చేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు ఆర్ఆర్ఆర్ సినిమాస్ పీవీఆర్ఆర్ఆర్ గా కనపడనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 70కిపైగా నగరాల్లోని 170కిపైగా ప్రాంతాల్లో ఉన్న 850కిపైగా స్క్రీన్లను ఇకపై ‘పీవీఆర్ఆర్ఆర్’గానే పిలుస్తారంటూ తెలిపింది.
For the first time ever in the world, a brand changed their name for the film… For RRR… 🤟🏻
it will be referred as PVRRR for next few months across India in 850+ screens and 170+ properties in 70+ cities… pic.twitter.com/TtcOUSAteL
— RRR Movie (@RRRMovie) October 29, 2021
రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.