అల్లు అర్జున్ పై బాలీవుడ్ నిర్మాత , దర్శకుల ప్రశంసలు

Bollywood Directors and Producers Showers Praises On Icon Staar Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,bollywood producer karan johar comments on allu arjun,Bollywood Directors and Producers Showers Praises On Stylish Star Allu Arjun,Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun New Movie News,Allu Arjun Latest Film Details,Allu Arjun Next Project News,Allu Arjun Upcoming Movie Details

కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ పలు విధాల నష్టపోయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన్న అన్ని భాషల చిత్రాలు విడుదల వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకుంటుంది . “వరుడు కావలెను ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ .. కరోనా కారణంగా సినీ ప​రిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందనీ , ఇప్పుడిప్పుడే మహమ్మారి ప్రభావం తగ్గడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు థియేటర్లోకి వస్తున్నారనీ , ఇప్పటి నుంచి భారత సినీ పరిశ్రమలో అన్ని పెద్ద పెద్ద సినిమాలే రాబోతున్నాయనీ , అన్ని ఇండస్ట్రీల వారు బాగుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు లో ‘‘వరుడు కావలెను”, “రొమాంటిక్‌”, తమిళ్‌లో రజనీకాంత్‌గారి “అన్నాత్తే”, కన్నడలో “భజరంగీ 2”, హిందీలో “సూర్య వంశీ”.. సినిమాలు విడుదలవుతున్నాయనీ , అన్ని సినిమాలూ హిట్‌ అవ్వాలనీ , అలాగే ఈ డిసెంబరు 17న “పుష్ప” తో తాము వస్తున్నామనీ , ఈ మూవీ అందరికి నచ్చాలని కోరుకుంటున్నాననీ , ఇక ఎంటైర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఆల్‌ ది బెస్ట్‌ అనీ , ఈ దీపావళికి భారతీయ సినిమా మునుపటిలా ప్రేక్షకులను అలరించి మంచి బిజినెస్‌ చేస్తుందనే నమ్మకం ఉందనీ చెప్పారు.భారత సినీ పరిశ్రమలను ఉద్దేశించి బన్నీ వ్యాఖ్యలపై హందీ “సూర్యవంశీ” మూవీ దర్శకుడు రోహిత్‌ శెట్టి, నిర్మాత కరణ్‌ జోహార్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ట్వీట్‌ చేస్తూ బన్నీకి ధన్యవాదాలు తెలిపారు. మా చిత్రానికి విషెస్‌ తెలిపినందుకు థాంక్యూ బ్రదర్‌. మీరు నిజంగా రాక్‌స్టార్‌ అలాగే మీరు నటించిన “పుష్ప” మూవీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అని దర్శకుడు రోహిత్‌ ట్వీట్‌ చేయగా థ్యాంక్యూ బన్నీ.. నువ్వు నిజంగానే సూపర్‌స్టార్‌ అని నిర్మాత కరణ్‌ జోహార్‌ ట్వీట్‌ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here