లైన్ క్లియర్ చేసుకున్న ‘ఇండియన్ 2’ మేకర్స్

Makers Of Indian 2 Movie Gets All The Disputes Sorted,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Indian 2,Indian 2 Movie,Indian 2 Telugu Movie,Indian 2 Movie Updates,Indian 2 Telugu Movie Latest News,Makers Of Indian 2 Movie Latest News,Makers Of Indian 2 Movie New Update

శంకర్ – లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ మధ్య ఇటీవల ఇండియన్ 2 సినిమా గురించి వచ్చిన వివాదం గుర్తుండే ఉంటుంది కదా. నిజానికి ఈ సినిమాకు మొదటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇలా షూటింగ్ మొదలైంది అనుకునే లోపు క్రేన్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తరువాత కరోనా రావడం.. మధ్యలో కమల్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో మధ్యలో మేకప్ వల్ల వచ్చిన స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలా ఒకదాని తరువాత ఒకటి అడ్డంకులు రావడంతో మొత్తానికే ఈసినిమా ఆగిపోయింది. ఇక ఈసినిమా గురించి అందరూ మర్చిపోయారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండా ఈగ్యాప్ లో శంకర్ రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయ్యాడు. ఆ తరువాత అపరిచితుడు సినిమాను కూడా ప్రకటించాడు. దీంతో లైకా సంస్థ లైన్ లోకి వచ్చి ఇండియన్ 2 సినిమాను ఆపాలని కోర్టుకు వెళ్లింది. ఈనేపథ్యంలో ఫైనల్ గా పలు వాదనల అనంతరం కోర్టు దర్శకుడికి అనుకూలంగానే తీర్పునిచ్చింది. అయితే మళ్లీ ఇప్పుడు ఈసినిమా వివాదం తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శంకర్, లైకా నిర్మాతలు ఒక ఒప్పందానికి వచ్చారట. ప్రస్తుతం శంకర్ కమిటయిన రామ్ చరణ్ మూవీ పూర్తి చేసి.. ‘ఇండియన్ 2’ మొదలుపెట్టేలా రాజీ కుదుర్చుకున్నారట. ఆ తర్వాత హిందీ ‘అపరిచితుడు’ సెట్స్ మీదకి తెచ్చేందుకు శంకర్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇక మరోవైపు కమల్ లోకేష్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టినా మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. అయితే ‘విక్రమ్‌’ పూర్తయిన వెంటనే ‘ఇండియన్‌-2’ చిత్రం షూటింగ్‌ ప్రారంభమవుతుందని కమల్ కూడా ఈమధ్య క్లారిటీ ఇచ్చారు. మరి అటు శంకర్ ఇటు కమల్ ఇద్దరి ప్రాజెక్స్ట్ అయిపోయిన తరువాత ఇండియన్ 2 మొదలుపెడతారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =