అంచనాలు అందుకోలేకపోయా.. సారీ చెప్పిన అజయ్‌ భూపతి..!

Ajay Bhupathi Extend Apologies To The Audience,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ajay Bhupathi Extend Apologies As He Couldn't Reach To The Expectations Of Audience,Ajay Bhupathi,Director Ajay Bhupathi,Ajay Bhupathi Latest News,Ajay Bhupathi New Movie News,Ajay Bhupathi Next Project Details,Ajay Bhupathi Upcoming Movie Details,Ajay Bhupathi Latest Film Updates

అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్-సిద్దార్థ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ మహాసముద్రం. అజయ్ భూపతి తీసిన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తో సంచలన విజయం సాధించడంతో రెండో సినిమా అయిన మహా సముద్రంపై మొదటినుండి అంచనాలు పెట్టేసుకున్నారు అందరూ. దానికి తోడు ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ లు కూడా అదే రేంజ్ లో ఉండటంతో పక్కా హిట్ కొడతాడు అనుకున్నారు. కానీ మొదటి సినిమా హిట్‌ కొట్టిన అజయ్‌ భూపతి… రెండో సినిమా వచ్చే సరికి కాస్త తడబడ్డాడు. కథలో బలం లేకపోవడం, సన్నివేశాలు ఆసక్తిని కలిగించకపోవడంతో.. అందరినీ నిరాశ పరిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఆ అంచనాలను అందుకోలేకపోవడంతో అటు మేకర్స్ మాత్రమే కాదు ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశచెందుతున్నారు. కొంతమంది అభిమానులు మాత్రం ఏకంగా సోషల్ మీడియా ద్వారానే అజయ్ భూపతిని అడుగుతున్నారు. ఇక తాజాగా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది అజయ్ భూపతికి. దీంతో అజయ్ భూపతి కూడా స్పందించి ” మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు క్షమించండి.. వచ్చే సారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తాను” అని ట్విట్టర్‌ వేదికగా సారీ చెప్పారు. మరి చూద్దాం ఈసారి అజయ్ భూపతి మంచి సాలిడ్ కథతో వస్తాడేమో…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 2 =