
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 39


'రాధేశ్యామ్' ట్రైలర్ కు నేను వర్క్ చేయలేదు..!

'రాధేశ్యామ్'.. ట్రైలర్ రిలీజ్ కు స్టేజ్ సెట్

ప్రపంచంలోనే గొప్ప తాతగారు..!

జిమ్ లో హీరో విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్ న్యూ లుక్

మెహరీన్ కు బంపర్ ఆఫర్ ?

"రాధేశ్యామ్" డబ్బింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే

"రాధేశ్యామ్ " మూవీ ఫస్ట్ డే షూటింగ్ లో భాగ్యశ్రీ

పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ లుక్

వైరల్ గా 'సితార' డ్యాన్స్.. నెటిజన్స్ ఫిదా ..!

కల నెరవేరింది - పూజాహెగ్డే

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటో

'విరాట పర్వం'.. త్వరలో రిలీజ్ ప్రకటన..!

అందం అంటే .. - కృతిశెట్టి

"ఏజెంట్" మూవీ బుడాఫెస్ట్ షెడ్యూల్ పూర్తి

మాల్దీవ్స్ లో పూజాహెగ్డే ఎంజాయ్

'రాధేశ్యామ్'.. బంపరాఫర్ కొట్టేసిన నవీన్ పోలిశెట్టి
ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ సినిమా కూడా ఒకటి. ఇక ప్రభాస్ సినిమా కాబట్టి చెప్పేదేముంది.. సినిమా ప్రారంభించిన దగ్గరనుండే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది కాబట్టి ఇప్పటినుండే ప్రమోషన్స్ వేగవంతం చేశారు. దానిలో భాగంగానే పోస్టర్లు, పలు పాటలు రిలీజ్ చేస్తూ మంచి బజ్ క్రియట్ చేస్తున్నారు.

'రాధేశ్యామ్' ట్రైలర్ కు నేను వర్క్ చేయలేదు..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో క్లాస్ లుక్ లో కనిపించనుండగా.. పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఇక ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా.. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి ప్రమోషన్ వీడియోస్, సాంగ్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీగా నిర్వహిస్తున్నారు.

'రాధేశ్యామ్'.. ట్రైలర్ రిలీజ్ కు స్టేజ్ సెట్
ఈసంక్రాంతికి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ కూడా ఒకటి. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాధేశ్యామ్'. ఈసినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ వరుస అప్ డేట్స్ ఇస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి పలు పోస్టర్లతో పాటు వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. పాటలు కూడా అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి.

ప్రపంచంలోనే గొప్ప తాతగారు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం మహేష్ కూతురు గానే కాదు తన టాలెంట్ తో కూడా అందరినీ ఫిదా చేసేస్తుంటుంది సితార. చిన్నప్పటినుండి సితార చాలా యాక్టీవ్ గానే ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వీడియోలు కానీ ఫొటోలు కానీ ఏవి పోస్ట్ చేసినా అవి వైరల్ గా మారుతుంటాయి. ఇక ఇప్పుడైతే సితారనే సొంతగా యూట్యూబ్ ఛానల్ ను అలానే ఇన్ట్సా అకౌంట్ ను మెయిన్ టైన్ చేస్తుంది.

జిమ్ లో హీరో విజయ్ దేవరకొండ
సూపర్ హిట్ "పెళ్ళిచూపులు" మూవీ తో టాలీవుడ్ కు హీరో గా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో ఫ్రస్టేటెడ్ లవర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా మారారు. ఆ మూవీ తో విజయ్ అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. "గీత గోవిందం ", "టాక్సీవాలా"వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్వంత బ్యానర్ పై మూవీస్ నిర్మిస్తూ విజయ్ నిర్మాతగా కొనసాగుతున్నారు.

2021 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ లో సర్కారు వారి పాట, వకీల్ సాబ్
ఒకప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేదు కాబట్టి సినిమాలకు వ్యూస్ పరంగా రికార్డులు అంటూ లెక్కలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా పోటీనే. యూట్యూబ్ లో వ్యూస్ పరంగా కానీ, ట్విట్టర్ లో ట్వీట్ లు, ట్యాగ్ లు ఇలా ప్రతి విషయంలోనూ రికార్డులే. ఇక ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటారు తమ హీరోల రికార్డ్ లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంటారు.

హెబ్బా పటేల్ న్యూ లుక్
“అలా ఎలా “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన హెబ్బా పటేల్ సూపర్ హిట్ ”కుమారి 21 F “ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అంధగాడు “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో హెబ్బా పటేల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “భీష్మ “మూవీ లో అతిథి పాత్రలో , “RED ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో హెబ్బాపటేల్ ప్రేక్షకులను అలరించారు.

మెహరీన్ కు బంపర్ ఆఫర్ ?
సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా రూపొందనున్న కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఘోస్ట్ " మూవీ లో హీరో నాగార్జున కు జోడీగా మెహరీన్ ఎంపిక అయినట్టు సమాచారం.

"రాధేశ్యామ్" డబ్బింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం…

"హైవే " మూవీ కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజ్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ విభిన్న కథాంశాల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆనంద్ దేవరకొండ హీరోగా సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి నిర్మాతగా సూపర్ హిట్ "118 "మూవీ ఫేమ్ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, మానస రాధా కృష్ణన్ జంటగా "హైవే మూవీ తెరకెక్కింది. సరి కొత్త లుక్ లో ఆనంద్ కనిపించనున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ కీలకపాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సయామీఖేర్ ముఖ్య పాత్రలో నటించారు.

"రాధేశ్యామ్ " మూవీ ఫస్ట్ డే షూటింగ్ లో భాగ్యశ్రీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ లుక్
సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం “కిరాతక ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏంజెల్ “ మూవీ తో పాయల్ రాజ్ పుత్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.పాయల్ ఇప్పుడు “హెడ్ బుష్ “మూవీ తో శాండల్ వుడ్ లో అడుగుపెడుతున్నారు.

వైరల్ గా 'సితార' డ్యాన్స్.. నెటిజన్స్ ఫిదా ..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ కిడ్ కాబట్టి ఎలాగూ సితార అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే కేవలం సితార మహేష్ కూతురు గానే కాదు తన టాలెంట్ తో కూడా అందరినీ ఫిదా చేసేస్తుంటుంది. చిన్నప్పటినుండి సితార చాలా యాక్టీవ్ గానే ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వీడియోలు కానీ ఫొటోలు కానీ ఏవి పోస్ట్ చేసినా అవి వైరల్ గా మారుతుంటాయి. ఇక ఇప్పుడైతే సితారనే సొంతగా యూట్యూబ్ ఛానల్ ను అలానే ఇన్ట్సా అకౌంట్ ను మెయిన్ టైన్ చేస్తుంది.

కల నెరవేరింది - పూజాహెగ్డే
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటో
సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ కథానాయికగా రూపొందిన "రౌడీ బాయ్స్ 'మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, "తలై నగరం 2" తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

'విరాట పర్వం'.. త్వరలో రిలీజ్ ప్రకటన..!
వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. ఈసినిమా కంటే లేట్ గా మొదలైన సినిమాలు కూడా రిలీజ్ అయిపోయాయి కానీ ఈసినిమా రిలీజ్ మాత్రం పలు కారణాలవల్ల ఆలస్యం అయింది. రీసెంట్ గానే మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ ను కంప్లీట్ చేసింది చిత్రయూనిట్. అయితే గత కొద్దికాలంగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్.

అందం అంటే .. - కృతిశెట్టి
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీతో టాలీవుడ్ కు కృతి శెట్టి కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో కృతి శెట్టి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్అందుకుంటున్నారు.నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్” మూవీ లో కృతిశెట్టి ముగ్గురు కథానాయికలలో ఒకరిగా నటించారు. ఆ మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. .

"ఏజెంట్" మూవీ బుడాఫెస్ట్ షెడ్యూల్ పూర్తి
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మాల్దీవ్స్ లో పూజాహెగ్డే ఎంజాయ్
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

4 నెలలలో10 లక్షల మంది ఫాలోవర్స్ తో అనుష్క రికార్డ్
“సూపర్” మూవీ తో టాలీవుడ్ కు , “రెండు”మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు అనుష్క పెట్టింది పేరుగా మారారు. “విక్రమార్కుడు”, “అరుంధతి “, “వేదం”, “బాహుబలి“, “రుద్రమదేవి “, “భాగమతి ”వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అనుష్క ఆకట్టుకున్నారు. పలు మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. యు వి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక మూవీ కి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .