స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్”, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న రెండు ప్రాజెక్ట్స్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా , రకుల్ ప్రీత్ జంటగా “డాక్టర్ జీ” హిందీ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో రకుల్ డాక్టర్ ఫాతిమా పాత్రలో నటిస్తున్నారు. కెరీర్‌లో తొలిసారి వైద్యురాలి పాత్రను షోషిస్తున్న రకుల్ మాట్లాడుతూ .. డాక్టర్ క్యారెక్టర్ కై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాననీ , ముందుగా వైద్యుల పరిభాషపై ఎక్కువగా దృష్టిపెట్టాననీ , ఆసుపత్రిలో వారు ఉపయోగించే భాష , రోగులతో సంభాషిస్తున్నప్పుడు వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయో కొందరు నిజమైన వైద్యుల్ని కలిసి తెలుసుకున్నాననీ , డాక్టర్‌గా తన పాత్రలో ఎలాంటి నాటకీయత లేకుండా నేచురల్ గా ఉండాలని దర్శకుడు సూచించారనీ , అందుకు అనుగుణంగా అనేక విషయాల్ని తెలుసుకున్నానానీ , డాక్టర్ యూనిఫామ్ వేసుకుంటేనే బాధ్యత వచ్చినట్లుగా ఫీల్ అయ్యాననీ , తాను నిజమైన డాక్టర్‌లా నటిస్తున్నానని యూనిట్ సభ్యులు ప్రశంసించడం ఉత్సాహానిచ్చిందనీ , తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అవుతుందనీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: