ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ సినిమా కూడా ఒకటి. ఇక ప్రభాస్ సినిమా కాబట్టి చెప్పేదేముంది.. సినిమా ప్రారంభించిన దగ్గరనుండే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది కాబట్టి ఇప్పటినుండే ప్రమోషన్స్ వేగవంతం చేశారు. దానిలో భాగంగానే పోస్టర్లు, పలు పాటలు రిలీజ్ చేస్తూ మంచి బజ్ క్రియట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా భారీగానే నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రభాస్ అభిమానులే అతిథులుగా హాజరుకానున్నారు. ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్స్‌ను ఫ్యాన్స్ చేతులమీదుగా విడుదల చేయనున్నారు. ఇక ఈకార్యక్రమానికి మరో విశేషం ఏంటంటే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా నవీన్ పోలిశెట్టి బంపరాఫర్ కొట్టేశాడు. మరి ఇలాంటి అవకాశం ఈ యంగ్ హీరోకు రావడం నిజంగా విశేషమే.
కాగా స్వరూప్ ఆర్ఎస్ జె దర్శకత్వంలో తెరకెక్కిన ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీతో నవీన్ పోలిశెట్టి హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇక చిన్న సినిమా వచ్చిన ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” భారీ సక్సెస్ అందుకుంది. ఈ తరువాత జాతి రత్నాలు అంటూ వచ్చాడు. ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు నవీన్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: