
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 38


నిత్యా మీనన్ మనసులో మాట

హీరో అజిత్ కు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం

వరుస అవకాశాలతో టాలీవుడ్ లో బిజీగా 'జయమ్మ'

'అఖండ' ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోలేదు...!

"హరిహర వీరమల్లు " కై మరో భారీ సెట్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వాయిదా పడ్డ టీజర్

స్టైలిష్ లుక్ లో "అఖండ " బ్యూటీ

"#RAPO 19" న్యూ షెడ్యూల్ ప్రారంభ డేట్

నా జీవితంపై నాకు క్లారిటీ ఉంది..!

రష్మిక 5 ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ

అర్జున ఫల్గుణ మూవీ పబ్లిక్ టాక్

విజయ్ దేవరకొండ ఇన్ స్టా రికార్డ్

ఎన్టీఆర్ కు జోడీ గా సామ్.. ఇదే క్లారిటీ..!

'రాధేశ్యామ్' బ్లాక్ బస్టర్.. ఇది ఫిక్స్

'రాధేశ్యామ్' కోసం రంగంలోకి దిగిన థమన్

'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కింది. మూడేళ్లుగా ఈసినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎన్నో రిలీజ్ డేట్ లు మారాయి. ఇక ఫైనల్ గా ఈ ఏడాది సంక్రాంతికి ఈసినిమా విడుదల అవుతుందని అందరూ వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల మళ్లీ రిలీజ్ కు బ్రేక్ పడింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గడం.. దానికి తోడు కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూత పడటంతో రిలీజ్ ను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. కేవలం సరైన సమయం చూసుకొని విడుదల…

డిస్నీ హాట్ స్టార్ లోకి వచ్చేసిన 'అఖండ'
గత ఏడాది చివరిలో రిలీజ్ అయిన సినిమాల్లో అఖండ, పుష్ప సినిమాలు కాస్త పెద్ద సినిమాలు అని చెప్పొచ్చు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాయి. వీటిలో పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప అటు తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక అఖండ సినిమా కూడా మాములు హిట్ కాదు బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈసినిమాతో అటు బాలకృష్ణ-బోయపాటి కూడా హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పటికే సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకొని ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఓవర్‌సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టిందీ సినిమా. ఇటీవలి కాలంలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా…

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో వస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

నిత్యా మీనన్ మనసులో మాట
మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 50 సినిమాలలో నటించిన యాక్ట్రెస్ , సింగర్ నిత్యామీనన్ 8 సంవత్సరాల వయసు లో ఒక ఇంగ్లీష్ మూవీ లో నటించారు. "ఆకాశగోపురం " తో మలయాళ , "అలామొదలైంది "తో తెలుగు , "నూటరెంబదు "తో తమిళ చిత్ర పరిశ్రమలకు కథానాయికగా పరిచయం అయ్యారు. " 7 O' Clock"మూవీ లో సపోర్టింగ్ రోల్ తో నిత్యామీనన్ కన్నడ చిత్ర పరిశ్రమకు , "మిషన్ మంగళ్ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

హీరో అజిత్ కు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం
కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న అజిత్ కుమార్ ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అజిత్ హీరోగా తెరకెక్కిన "వాలిమై"మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మాతగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "#AK61" మూవీ కి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "నెర్కొండ పార్వై", "వాలిమై" మూవీస్ తరువాత వీరి ముగ్గురి కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది.

వరుస అవకాశాలతో టాలీవుడ్ లో బిజీగా 'జయమ్మ'
తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు క్రాక్ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చేసిన జయమ్మ పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టడమే కాదు ఇప్పటికే క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నాంది సినిమా లో కూడా లాయర్ పాత్రలో నటించి అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లో బిజీ బిజీ అవుతుంది. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ వెళుతుంది. పెద్ద పెద్ద సినిమాలో కీలక పాత్రలను సైతం దక్కించుకుంటుంది. మేకర్స్ కూాడా వరలక్ష్మీ కి మంచి పాత్రలు ఇవ్వడానికి సిద్దపడుతున్నారు.

నాగచైతన్య చెప్పిన విడాకుల వార్త కు నాగార్జున స్పందన
ఫస్ట్ టైమ్ నాగచైతన్య , సమంత జంటగా నటించిన "ఏ మాయచేసావె" మూవీ ఘనవిజయం సాధించింది. తరువాత కొన్ని సినిమాలలో జంటగా నటించిన నాగచైతన్య , సమంత లు రిలేషన్ షిప్ లో ఉండి 2017 లో వివాహం చేసుకున్నారు. 2021 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ వారి కెరీర్ లలో బిజీగా ఉన్నారు.

'అఖండ' ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోలేదు...!
ఈరోజుల్లో ఒక సినిమా థియేటర్లలో వారం రోజులు ఆడటమే ఎక్కువ అయిపోయింది. సూపర్ హిట్ సినిమాలే రెండు మూడు వారాల్లో వెళ్లిపోతున్నాయి. అలాంటిది ఇప్పుడు ఒక సినిమా 50 రోజులు ఆడటం అంటే మాములు విషయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఘనతను నందమూరి బాలకృష్ణ సాధించారు. ఆయన హీరోగా నటించిన ‘అఖండ’మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో చూశాం. ఈసినిమాతో ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టారు. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడుతుంది.

"హరిహర వీరమల్లు " కై మరో భారీ సెట్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వాయిదా పడ్డ టీజర్
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్, ఫస్ట్‌లుక్ చిత్రంపై క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల టీజర్‌ను విడుదల చేయలేకపోయింది. ఇక ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సాంకేతిక కారణాల…

స్టైలిష్ లుక్ లో "అఖండ " బ్యూటీ
దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. “అఖండ”మూవీ భారీ విజయం సాధించినందుకు ప్రగ్య జైస్వాల్ చాలా ఆనందం గా ఉన్నారు. ప్రగ్య టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం ఉంది. “అఖండ”మూవీ తో ప్రగ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యింది.

"#RAPO 19" న్యూ షెడ్యూల్ ప్రారంభ డేట్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO19” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది.

నా జీవితంపై నాకు క్లారిటీ ఉంది..!
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సింగర్ సునీత. కొన్నేళ్లుగా సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న సునీత ఇక ఇటీవలే రెండో వివాహం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్ కంపెనీ అధినేత రామ్ వీరపనేని ని వివాహమాడారు. ఇక ఇప్పుడు అటు ప్రొఫెషనల్ లైఫ్ ను పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన వివాహం, వృత్తి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేసింది.

రష్మిక 5 ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ
సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” (2016)కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న బ్లాక్ బస్టర్ "ఛలో "(2018 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు." గీత గోవిందం " , "సరిలేరు నీకెవ్వరు", "భీష్మ ", "పుష్ప :ది రైజ్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "సుల్తాన్ " మూవీ తో కోలీవుడ్ కు రష్మిక పరిచయం అయ్యారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ "మిషన్ మజ్ను " 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది.

అర్జున ఫల్గుణ మూవీ పబ్లిక్ టాక్
Just saw Arjuna Phalguna 🔥 Blockbuster Hit Sree Vishnu acting was on point. Great action , romance , comedy Totally must watch movie 🔥💯 2021 ending with a…

ప్రయోగాత్మక మూవీస్ కు ప్రాధాన్యత ఇస్తా -నభా నటేష్
మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నభా నటేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "సోలో బ్రతుకే సో బెటర్" , "అల్లుడు అదుర్స్" , "మాస్ట్రో" మూవీస్ తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు.

విజయ్ దేవరకొండ ఇన్ స్టా రికార్డ్
సూపర్ హిట్ “పెళ్ళిచూపులు” మూవీ తో టాలీవుడ్ కు హీరో గా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా మారారు. “గీత గోవిందం “, “టాక్సీవాలా”వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “లైగర్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. అనన్య పాండే కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “నిన్నుకోరి “, “మజిలీ”మూవీస్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీకి విజయ్…

ఎన్టీఆర్ కు జోడీ గా సామ్.. ఇదే క్లారిటీ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా 2018 లో ‘అరవింద సమేత’ సినిమాతో బిగ్ స్క్రీన్ పై అలరించాడు ఎన్టీఆర్. ఇక దాదాపు మూడేళ్లకు పైగా ఈసినిమాతోనే బిజీగా ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు ఎంత బజ్ క్రియేట్ అయిందో చూశాం. దానికి తోడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చాలా భారీగా చేస్తున్నాడు రాజమౌళి. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఎక్కడా తగ్గకుండా చిత్రయూనిట్ మొత్తం ప్రమోషన్స్ చేస్తుంది. ఇక రాజమౌళి మ్యాజిక్ ను చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

'రాధేశ్యామ్' బ్లాక్ బస్టర్.. ఇది ఫిక్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్రబృందం చేస్తున్న సినిమా ప్రమోషన్స్ కూడా సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, పాటలు పలు రికార్డులను నమోదు చేశాయి. దీనితోపాటు రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. లవ్ స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్, డ్రామా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ట్రైలర్‌లో ఉన్నాయి. దీనితో సినిమాపై మరంత అంచనాలు పెరిగాయి.

'రాధేశ్యామ్' కోసం రంగంలోకి దిగిన థమన్
రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న ప్రేమకథ రాధేశ్యామ్. ఇక సంక్రాంతి పండుగ సందర్బంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకొని వ్యూస్ తో దూసుకుపోతుందో చూస్తున్నాం.