“సూపర్” మూవీ తో టాలీవుడ్ కు , “రెండు”మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు అనుష్క పెట్టింది పేరుగా మారారు. “విక్రమార్కుడు”, “అరుంధతి “, “వేదం”, “బాహుబలి“, “రుద్రమదేవి “, “భాగమతి ”వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అనుష్క ఆకట్టుకున్నారు. పలు మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. యు వి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక మూవీ కి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశీయ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ “కూ “క్రమేణా ఆదరణ పొందుతోంది. “కూ ” లో పలువురు సెలబ్రిటీస్ ఖాతాలు ఓపెన్ చేస్తున్న విషయం తెలిసిందే. అనుష్క కూడా “కూ “యాప్ లో ఎంటర్ అయ్యారు. ఇకపై “కూ “వేదికపైనే తన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటానని వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ యాప్ లో అనుష్క 4 నెలలలో 10 లక్షల మంది ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: