సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా రూపొందనున్న కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఘోస్ట్ ” మూవీ లో హీరో నాగార్జున కు జోడీగా మెహరీన్ ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం “F 3” మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వరస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి “F 3” మూవీ తరువాత హీరో బాలకృష్ణ కథానాయకుడిగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ లో కథానాయికగా మెహరీన్ ఒక బంపర్ ఆఫర్ అందుకున్నట్టు సమాచారం. “#NBK107 ” మూవీ తరువాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: