ఒకప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేదు కాబట్టి సినిమాలకు వ్యూస్ పరంగా రికార్డులు అంటూ లెక్కలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా పోటీనే. యూట్యూబ్ లో వ్యూస్ పరంగా కానీ, ట్విట్టర్ లో ట్వీట్ లు, ట్యాగ్ లు ఇలా ప్రతి విషయంలోనూ రికార్డులే. ఇక ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటారు తమ హీరోల రికార్డ్ లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ట్విట్టర్ లో ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో సర్కారు వారిపాట, వకీల్ సాబ్ కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. మోస్ట్ కోట్ ట్వీటెడ్ సినిమాగా సర్కారు వారి పాట స్థానం దక్కించుకుంది. ఈసినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఇంత క్రేజ్ తెచ్చుకోవడం అంటే గ్రేట్ అనే చెప్పాలి.
👏 most Quote Tweeted in entertainment, 2021 👇https://t.co/mYQcl7GNEh
— Twitter India (@TwitterIndia) December 9, 2021
ఇదిలా ఉండగా 2021లో అత్యధికంగా ట్వీట్ చేసిన చిత్రాలలో వకీల్ సాబ్ తో పాటు మన సౌత్ నుండి మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. విజయ్ ‘మాస్టర్’ మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో అజిత్ నటించిన ‘వాలిమై’ ఉంది. విజయ్ ‘బీస్ట్’ మూడవ స్థానంలో.. సూర్య ‘జై భీమ్’ నాలుగవ స్థానంలో.. 5వ స్థానంలో ‘వకీల్ సాబ్’ నిలిచింది. పవన్ మూవీ ఈ సంవత్సరంలో అత్యధికంగా ట్వీట్ చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: