ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్, ఫస్ట్‌లుక్ చిత్రంపై క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల టీజర్‌ను విడుదల చేయలేకపోయింది. ఇక ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల మేము ఇచ్చిన హామీ మేరకు ఈరోజు టీజర్‌ను విడుదల చేయలేకపోయాము. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాము. మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Hold on.. postponement in our teaser date but not in our excitement in showing it to you all.. It’s worth the wait😎🤘#AaAmmayiGurinchiMeekuCheppali #AAGMCTeaser pic.twitter.com/J8X5DO6Cde
— Sudheer Babu (@isudheerbabu) January 17, 2022
కాగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గానే మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగమయ్యారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పిజి విందా కెమెరా మెన్‌గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: