రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న ప్రేమకథ రాధేశ్యామ్. ఇక సంక్రాంతి పండుగ సందర్బంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకొని వ్యూస్ తో దూసుకుపోతుందో చూస్తున్నాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అప్పుడు థమన్ తనపై వచ్చిన వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. థమన్ రాధేశ్యామ్ ట్రైలర్ కోసం పనిచేస్తున్నాడంటూ వార్తలు రాగా.. ట్రైలర్ కోసం తను పనిచేయడం లేదని తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ అప్ డేట్ వచ్చింది. రాధేశ్యామ్ సినిమా కోసం థమన్ పనిచేస్తున్నాడు. అయితే ట్రైలర్ కోసం పనిచేయలేదు కానీ ఏకంగా ఈసినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఇప్పటికే ఈసినిమా కోసం నార్త్ కు ఒక మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తుండా… సౌత్ కు వేరే మ్యూజిక్స్ డైరెక్టర్స్ పనిచేస్తున్నారు. ఇక సౌత్ లో ఈ సినిమా పాటల కోసం జస్టిన్ ప్రభాకరన్ పనిచేస్తుండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ అందించనున్నాడు. ఇక హిందీ పాటలకి మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.
We are pleased to welcome the young music maestro @MusicThaman to score the BGM of #RadheShyam for South Languages!#Prabhas @hegdepooja @director_radhaa @justin_tunes @UV_Creations @TSeries @GopiKrishnaMvs pic.twitter.com/S2T1r568IE
— UV Creations (@UV_Creations) December 26, 2021
కాగా ఇంకా ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: