పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘రాధేశ్యామ్‘. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్రబృందం చేస్తున్న సినిమా ప్రమోషన్స్ కూడా సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, పాటలు పలు రికార్డులను నమోదు చేశాయి. దీనితోపాటు రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. లవ్ స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్, డ్రామా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ట్రైలర్‌లో ఉన్నాయి. దీనితో సినిమాపై మరంత అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను థమన్ అందిస్తున్నాడని రాధేశ్యామ్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈసినిమాకు మరింత బలం చేకూరినట్టైంది. ఇదిలా ఉండగా దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం.. అందులోనూ కేవలం 20 రోజుల్లో ఇవ్వడం సాధ్యమవుతుందా అని అడుగగా.. దానికి థమన్ స్పందిస్తూ.. అవునూ సాధ్యమవుతుంది ఒక సినిమా కథ, కంటెంట్ నిజమైనప్పుడు మనం మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంత వరకైనా వెళ్లొచ్చు.. రాధేశ్యామ్ బ్లాక్ బస్టర్.. ఇది పక్కా అని రిప్లై ఇచ్చాడు. ఇక థమన్ ఇచ్చిన రిప్లైకు ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
Yes when the film is super true to its content we can complete it and go to any extent and achieve the targets 🍭🎵❤️. #BlockbusterRadheshyam 🎵 IDHI FIX ⭐️ https://t.co/6zkliGBISG
— thaman S (@MusicThaman) December 27, 2021




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: