యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా 2018 లో ‘అరవింద సమేత’ సినిమాతో బిగ్ స్క్రీన్ పై అలరించాడు ఎన్టీఆర్. ఇక దాదాపు మూడేళ్లకు పైగా ఈసినిమాతోనే బిజీగా ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు ఎంత బజ్ క్రియేట్ అయిందో చూశాం. దానికి తోడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చాలా భారీగా చేస్తున్నాడు రాజమౌళి. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఎక్కడా తగ్గకుండా చిత్రయూనిట్ మొత్తం ప్రమోషన్స్ చేస్తుంది. ఇక రాజమౌళి మ్యాజిక్ ను చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు కూడా ఇప్పటికే సెట్స్ పైకి తీసుకెళ్లాలి కానీ మధ్యలో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం చేయడం.. ఆ తరువాత తన చేతికి కూడా గాయమవ్వడంతో కాస్త లేట్ అయింది. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఈసినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా సమంత నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈవార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఈసినిమాలో సమంత నటించడంలేదని.. ఇంతవరకూ ఈ ప్రాజెక్ట్ కోసం సమంత ను ఎవరూ అప్రోచ్ అవ్వలేదని అంటున్నారు. చూద్దాం మరి దీనిపై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో.
కొరటాల శివ దర్శకత్వంలో ఇంతకుముందు ‘జనతా గ్యారేజ్’ సినిమా చేసిన ఎన్టీఆర్, ఆ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈసినిమా ఎంత వరకూ విజయం అందిస్తుందో చూడాలి.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: