నా జీవితంపై నాకు క్లారిటీ ఉంది..!

Singer Sunitha Talks About Her Personal Life,Telugu Filmnagar,Tollywood Updates, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movie News,Latest Telugu Movie Updates,Tollywood Lates News,Latest Tollywood News, Singer Sunitha, Singer Sunitha,Singer Sunitha Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Singer Sunitha Personal Life, Tollywood Singer Sunitha,Mango Media Managing Director Ram Veerapaneni,S. P. Balasubrahmanyam

గాయ‌నిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది సింగర్ సునీత. కొన్నేళ్లుగా సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న సునీత ఇక ఇటీవలే రెండో వివాహం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్‌ కంపెనీ అధినేత రామ్‌ వీరపనేని ని వివాహమాడారు. ఇక ఇప్పుడు అటు ప్రొఫెషనల్ లైఫ్ ను పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన వివాహం, వృత్తి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీతను పెళ్లి తర్వాత మ్యారేజ్ లైఫ్‌ ఎలా ఉంది అని అడుగగా… చాలా హ్యాపీగా ఉన్నాను.. అది నా ముఖం చూస్తేనే అర్థమవుతుంది.. నా జీవితంపై క్లారిటీ ఉంది.. నేను నా లైఫ్ ఎలా ఉండాలి అని ముందే అనుకున్నాను.. నా జీవితం నాకు నచ్చినట్లుగా గౌరవంగా బతకాలనుకున్నాను. ఇప్పుడు అదే చేస్తున్నాను.. చాలా హ్యాపీగా ఉంది . అందులోనూ ఇద్దరం ఒకే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఒకరినొకరం అర్థం చేసుకుంటాం.. భార్యగా తనకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.. ఇక ప్రొఫెషనల్‌ లైఫ్‌ కంటే పర్సనల్‌ లైఫ్‌కే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తా అని తెలిపింది.

ఇంకా బాలు గారి గురించి కూడా మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు సునీత. 2021లో ఎంతోమందిని పోగొట్టుకున్నాను. ముఖ్యంగా బాలు గారిని పోగొట్టుకున్నా. ఆ విషాదం తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయి. ఇప్పుడు ఏదైనా బాధగలిగించే సంఘటన విన్నా కూడా కన్నీళ్లు రావడం లేదు. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ భావోద్వేగం అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =