
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 30


లవర్స్ డే స్పెషల్ :"రాధేశ్యామ్ " థీమ్ పార్టీ

మరోసారి మాస్టర్ కాంబో..?

'సలార్' లో నేను లేనంటున్న 'ఖిలాడి' భామ..!

"పుష్ప :ది రైజ్" హిందీ వెర్షన్ రికార్డ్స్

'7 డేస్ 6 నైట్స్' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

శివాత్మిక-రీతూవర్మ ల సినిమా టైటిల్ రిలీజ్..!

ట్రెండీ లుక్ లో అలియా భట్

#NBK107 షూటింగ్ అప్ డేట్..!

యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ పై నాగచైతన్య ఫోకస్

ఎన్టీఆర్ కు చరణ్ కు అదే తేడా..!

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ లుక్

బాహుబలిని మించి ఉంటుంది 'ఆర్ఆర్ఆర్'

9 వసంతాల "మిర్చి "

లేటెస్ట్ సెన్సేషన్ డైరెక్టర్ తో తలైవా సినిమా..?

నైజాం ఏరియాలో "అఖండ"రికార్డ్

25 రోజులు పూర్తి చేసుకున్న'బంగార్రాజు'

స్టూడెంట్స్ తో "గని "సందడి
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా “గని “మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే . “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర…

'ఖిలాడి' సినిమాపై మీనాక్షి, డింపుల్ హయాతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
క్రాక్ సినిమా విజయం తర్వాత రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కగా.. ఈనెల 11వ తేదీనప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనిలో భాగంగానే చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తుండగా ఈ భామలు కూడా జోరుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో వీరిద్దరూ ఖిలాడి సినిమా గురించి.. తమకు ఈసినిమాలో అవకాశం రావడం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

లవర్స్ డే స్పెషల్ :"రాధేశ్యామ్ " థీమ్ పార్టీ
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు…

మరోసారి మాస్టర్ కాంబో..?
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోల కాంబినేషన్ లో సినిమా అంటే మరింత క్రేజ్ ఉంటుంది. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లోనే సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ హీరోలు ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో విజయ్, విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా మంచి హిట్ అవ్వడమే కాదు.. విజయ్-విజయ్ సేతుపతి కాంబినేషన్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

'సలార్' లో నేను లేనంటున్న 'ఖిలాడి' భామ..!
ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ల సందడి ఎక్కువైంది. ఇప్పటి వరకూ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన సమంత, కాజల్, రకుల్ తెలుగులో కాస్త స్లో అయ్యారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న, పూజా హెగ్డే తమ హవా కొనసాగిస్తుండగా వారితో పాటు కొత్త హీరోయిన్స్ కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఆ లిస్ట్ లో మీనాక్షి చౌదరి కూడా ఉంది. ప్రస్తుతం ఈ భామ ఖిలాడి సినిమాలో రవితేజ సరసన ఒక హీరోయిన్ గా నటిస్తుంది. మరో రెండు రోజుల్లో ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది…

"పుష్ప :ది రైజ్" హిందీ వెర్షన్ రికార్డ్స్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు…

'7 డేస్ 6 నైట్స్' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ఎం.ఎస్. రాజు ఇటీవల దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే . ఈ సినిమా అందించిన విజయంతో ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. '7 డేస్ 6 నైట్స్' టైటిల్ తో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది . నిజానికి ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా అప్పుడు పరిస్థితులు బాలేకపోవడంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా మరోపక్క చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలోభాగంగానే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా…

శివాత్మిక-రీతూవర్మ ల సినిమా టైటిల్ రిలీజ్..!
కార్తీక్ దర్శకత్వంలో అశోక్ సెల్వన్, రీతూవర్మ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి నిన్నిలా-నిన్నిలా సినిమా చేయగా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈసినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ మూవీకి తమిళంలో ‘నిత్తమ్ ఒరు వానమ్’ టైటిల్ పెట్టగా తెలుగులో ‘ఆకాశం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ట్రెండీ లుక్ లో అలియా భట్
సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ “హైవే “, “2 స్టేట్స్”, “హంప్టీ శర్మ కి దుల్హనియా” , “షాందార్ “, “కపూర్&సన్స్ “, “ఉడ్తా పంజాబ్ “, “డియర్ జిందగీ” , “బద్రీనాథ్ కి దుల్హనియా “, “రాజి “, “గల్లీ బాయ్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అలియా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “గంగు భాయ్ కతియావాడి” ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. “బ్రహ్మాస్త్ర ” , “డార్లింగ్స్ “, “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ “మూవీస్ లో అలియా నటిస్తున్నారు.

"కె జి ఎఫ్ చాప్టర్ 2 " స్పెషల్ సాంగ్ లో నోరా ఫతేహి
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ టీజర్ 235 మిలియన్ పైగా వ్యూస్ తో…

#NBK107 షూటింగ్ అప్ డేట్..!
రీసెంట్ గా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ ఇప్పుడు అదే జోష్ తో తన కొత్త సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాను గత ఏడాదే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి కూడా విదితమే. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 16 నుండి ఈసినిమా షూటింగ్ ను తెలంగాణలోని సిరిసిల్ల…

యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ పై నాగచైతన్య ఫోకస్
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడున్న యంగ్ హీరోలలో నాగచైతన్య కుటుంబ కథా చిత్ర హీరోగా మారారు. కెరీర్ ఆరంభం లో నాగచైతన్య కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ లో నటించినా, ఆ తరువాత యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ పై ఫోకస్ పెట్టారు.

ఎన్టీఆర్ కు చరణ్ కు అదే తేడా..!
ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా తీయడం అంటే ఒక దర్శకుడికి ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఏ కొంచం తేడా జరిగినా ముఖ్యంగా ఫ్యాన్స్ నుండి ఎదురుదాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరకంగా దర్శకుడికి కత్తిమీద సాము లాంటిదే అలాంటి ప్రయత్నం. కానీ అందరి సంగతి ఏమో కానీ దర్శకధీరుడు రాజమౌళి లాంటి వాళ్లకు మాత్రం ఫ్యాన్స్ ను ఎలా శాటిస్ఫై చేయాలో తెలుసు. అందుకే అంత ధైర్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాను తీయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా కథ సిద్దం చేసుకున్నప్పుడే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని ఉంటాడు జక్కన్న. ఇక రాజమౌళి సినిమా అంటే ప్రతి ఒక్క హీరో ఎదురుచూస్తుంటారు కాబట్టి ఎన్టీఆర్, చరణ్ లు ఒప్పుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఇక…

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న డీజే టిల్లు హీరో, హీరోయిన్..!
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ చాలెంజ్ లో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు ఈ కార్యక్రమంలో డీజే టిల్లు హీరో, హీరోయిన్ కూడా పాల్గొని మొక్కలు నాటారు. ప్రశాసన్ నగర్ జీహెచ్ఎంసీ పార్క్ లో సిద్దూ,నటి నేహశెట్టి ఇద్దరూ మొక్కలు నాటారు.

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ లుక్
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ తల్లి కాబోతున్నారు. అందువల్ల సినిమాలకు దూరం అయ్యారు .ఈ సంవత్సరంలో “ఆచార్య “, “హే సినామిక “, “ఘోస్టీ “(తమిళ ), “ఉమ”(హిందీ ) మూవీస్ తో కాజల్ ప్రేక్షకాభిమానులను అలరించనున్నారు.యూఏఈలో ఉండేందుకు కాజల్ యూఏఈ దేశానికి చెందిన గోల్డెన్ వీసా అందుకున్న విషయం తెలిసిందే.

బాహుబలిని మించి ఉంటుంది 'ఆర్ఆర్ఆర్'
దేశ వ్యాప్తంగా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్.ఆర్.ఆర్". రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఒక్క సినిమా కోసమే ఎన్టీఆర్, చరణ్ దాదాపు మూడేళ్లు మరొక సినిమాకు కమిట్ కూడా అవ్వలేదు. అందుకే అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు చరణ్ ఫ్యాన్స్ కూడా మరింత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరి 7న విడుదల చేద్దామని.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు.. భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా చేశాడు రాజమౌళి. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాని మార్చి…

9 వసంతాల "మిర్చి "
యు వి క్రియేషన్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క , రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "మిర్చి " మూవీ 2013 ఫిబ్రవరి 8 వ తేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 6 నంది అవార్డ్స్ అందుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. "మిర్చి "మూవీ తో కొరటాల శివ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రభాస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొరటాల శివ డైలాగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

లేటెస్ట్ సెన్సేషన్ డైరెక్టర్ తో తలైవా సినిమా..?
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినీ లవర్స్ కి. తన విలక్షణమైన నటనతో.. డిఫరెంట్ మ్యానరిజమ్స్, స్టైల్స్ తో దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక ఈ వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది పెద్దన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ ఆసినిమాతో మంచి విజయాన్నే అందుకున్నాడు. అయితే ఆసినిమా తర్వాత ఇప్పటివరకూ మరో కొత్త సినిమాను ప్రకటించలేదు. మరోవైపు ఫ్యాన్స్ కూడా…

నైజాం ఏరియాలో "అఖండ"రికార్డ్
హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

25 రోజులు పూర్తి చేసుకున్న'బంగార్రాజు'
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సినిమా సీక్వెల్‌గా బంగార్రాజు తెరకెక్కించాడు కళ్యాణ్ కృష్ణ. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు.