‘సలార్’ లో నేను లేనంటున్న ‘ఖిలాడి’ భామ..!

Khiladi Actress Gives Clarity about Salaar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Khiladi Actress,Meenakshi Chaudhary Give Clarity About Salaar Movie,Meenakshi Chaudhary About Salaar Movie,Meenakshi Chaudhary New Movies,Meenakshi Chaudhary Latest Updates,Meenakshi Chaudhary Khiladi Movie, Meenakshi Chaudhary in Khiladi Movie,shruthi haasan in salaar Movie,salaar Upcoming movie of sruthi Haasan,salaar New Movie,Rebel Star Prabhas Salaar Movie,Salaar Upcoming Movie Of Prabhas,salaar Sruthi Haasan and Prabhas, Salaar Telugu Movie Updates,Prabhas Salaar Movie,Prabhas Latest Movie Salaar,Rebel Star Prabhas New Movie,Prabhas Upcoming Movies,Prabhas Upcoming Movie in 2022,Pan India Hero Prabhas Nex Movie Salaar, Rebel Star Prabhas,#salaar,#prabhas

ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ల సందడి ఎక్కువైంది. ఇప్పటి వరకూ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన సమంత, కాజల్, రకుల్ తెలుగులో కాస్త స్లో అయ్యారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న, పూజా హెగ్డే తమ హవా కొనసాగిస్తుండగా వారితో పాటు కొత్త హీరోయిన్స్ కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఆ లిస్ట్ లో మీనాక్షి చౌదరి కూడా ఉంది. ప్రస్తుతం ఈ భామ ఖిలాడి సినిమాలో రవితేజ సరసన ఒక హీరోయిన్ గా నటిస్తుంది. మరో రెండు రోజుల్లో ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. అంతేకాదు సలార్ లో తన రోల్ గురించి వస్తున్న వార్తలకు కూడా క్లారిటీ ఇచ్చింది. సలార్ లో నేను నటించడంలేదు.. సలార్ టీమ్ ఎవరూ ఇంత వరకూ నన్ను అప్రోచ్ అవ్వలేదు అని క్లారిటీ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా వస్తుంది. ఈసినిమాలో మీనాక్షి చౌదరితో పాటు డింపుల్‌ హయతి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈసినిమా నుండి రిలీజ్ చేసిన ప్రతి పోస్టర్ కు అలానే టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఎలా ఉంటుందో చూడాలి.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =