ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోల కాంబినేషన్ లో సినిమా అంటే మరింత క్రేజ్ ఉంటుంది. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లోనే సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ హీరోలు ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో విజయ్, విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా మంచి హిట్ అవ్వడమే కాదు.. విజయ్-విజయ్ సేతుపతి కాంబినేషన్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈకాంబినేషన్ మరోసారి సెట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానుందని.. కోలీవుడ్ లో స్టార్ నిర్మాతలలో ఒకరైన కలైపులి థాను ఈసినిమాను నిర్మించనున్నారని వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
కాగా ప్రస్తుతం విజయ్ బీస్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తెలుగులో కూడా విజయ్ మరో సినిమా చేయబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కనుంది. మరోవైపు విజయ్ సేతుపతి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంకా వెబ్ సిరీస్ లలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: