గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన “రాధేశ్యామ్” మూవీ వివిధ కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న నైట్ థీమ్ పార్టీ పేరుతో ఒక ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కెమిస్ట్రీ క్లబ్‌లో ప్రత్యేకంగా సెట్ వేసి ఈ ఈవెంట్ నిర్వహించనున్నారనీ , ఈ సినిమా కథకు తగ్గట్టుగా ఈ సెట్ ఉంటుందనీ , సౌత్ ఇండియాలోనే తొలిసారి ఇటువంటి థీమ్ పార్టీ ఈవెంట్ జరగనుందనీ , ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ అంతా అటెండ్ అవుతారనీ సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: