మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా “గని “మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే . “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ పోస్టర్స్ , ఫస్ట్ పంచ్ , టీజర్ ,రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గని”మూవీ లోని మూడవ సాంగ్ విజయవాడ లో రిలీజ్ అయ్యింది. దర్శకుడు శంకర్ తనయ అతిది శంకర్ గానం చేసిన ఈ సాంగ్ ను కె.ఎల్.యూనివర్సిటీ స్టూడెంట్స్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో వరుణ్ తేజ్ , దర్శకుడు కిరణ్ కొర్రపాటి, నిర్మాత అల్లు బాబీ, సంగీత దర్శకుడు తమన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు బాబీ మాట్లాడుతూ సినిమా అద్భుతంగా వచ్చిందనీ , థమన్ మంచి సంగీతం అందించారనీ , తొలి పాట వినగానే తమన్‌కు ఫోన్ చేసి అభినందించాననీ , అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయనీ , ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నామనీ , దానికి తగ్గట్లు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నామనీ , త్వరలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: