నైజాం ఏరియాలో "అఖండ"రికార్డ్
Balakrishna's Akhanda Movie Record at Nizam Box-Office

హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.
“అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. “అఖండ ” మూవీ 75 కోట్ల షేర్ సాధించింది. 60 రోజుల పాటు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించే కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో “అఖండ ” మూవీకి 10.5 కోట్ల బిజినెస్ జరుగగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైమ్ కి "అఖండ " నైజాంలో 21.17 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా 10.5 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 10.67 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
వీడియోస్
00:34:36Balakrishna & Boyapati Srinu Superb Answers to Media
00:22:45Balakrishna Superb Speech
00:03:36Balakrishna Mass Entry
00:02:16


