లేటెస్ట్ సెన్సేషన్ డైరెక్టర్ తో తలైవా సినిమా..?

Latest Buzz about Superstar Rajinikanths New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Rajinikanth,Rajinikanth latest Movies,Rajinikanth movie Updates,Rajinikanth Upcoming Movie 2022,Rajinikanth New Movies in 2022,Rajinikanth latest Buzz,latest Buzz About Super Star Rajinikanth, Nelson Dilipkumar Director,Rajinikanth with Nelson Dilipkumar,Nelson Dilipkumar New Movie With Rajinikanth,Nelson Dilipkumar Movies,Nelson Dilipkumar Doctor Movie,Nelson Dilipkumar Upcoming Movie with Rajinikanth, Anirudh Ravichander Music Composer,Anirudh Ravichander Music For Rajinikanth Next Movie,Anirudh Ravichander Music For Rajinikanth and Nelson Dilipkumar Movie,Annaatthe Movie, Annaatthe Movie Rajinikanth,Siruthai Siva,Siruthai Siva Director,Siruthai Siva New Movie with rajinikanth,Siruthai Siva Another Movie With rajinikanth,#rajinikanth

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినీ లవర్స్ కి. తన విలక్షణమైన నటనతో.. డిఫరెంట్ మ్యానరిజమ్స్, స్టైల్స్ తో దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక ఈ వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది పెద్దన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ ఆసినిమాతో మంచి విజయాన్నే అందుకున్నాడు. అయితే ఆసినిమా తర్వాత ఇప్పటివరకూ మరో కొత్త సినిమాను ప్రకటించలేదు. మరోవైపు ఫ్యాన్స్ కూడా రజనీకాంత్ కొత్త సనిమా అనౌన్స్ మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. రజనీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు నెల్సన్ దిలీప్ కుమార్. డాక్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్.. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విజయ్ తో బీస్ట్ సినిమా చేస్తున్నాడు. అయితే వినిపిస్తున్న వార్తల ప్రకారం నెల్సన్ తో రజనీకాంత్ సినిమా చేయబోతున్నాడని..దీనికి అనిరుధ్ సంగీతం అందించనున్నాడని అంటున్నారు. అంతేకాదు త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా గతంలో రజనీకాంత్ మరోసారి అన్నాత్తే డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. పెద్దన్న సినిమా తీసిన విధానం తనకు నచ్చిందని అందుకే శివకే మరో ఛాన్స్ రజనీ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. మరి వీటిలో ఎంత నిజముందో తలైవా నెక్స్ట్ సినిమా ఎవరితో ఫిక్స్ చేస్తారో అన్న విషయం తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ మాత్రం ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 7 =