ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా తీయడం అంటే ఒక దర్శకుడికి ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఏ కొంచం తేడా జరిగినా ముఖ్యంగా ఫ్యాన్స్ నుండి ఎదురుదాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరకంగా దర్శకుడికి కత్తిమీద సాము లాంటిదే అలాంటి ప్రయత్నం. కానీ అందరి సంగతి ఏమో కానీ దర్శకధీరుడు రాజమౌళి లాంటి వాళ్లకు మాత్రం ఫ్యాన్స్ ను ఎలా శాటిస్ఫై చేయాలో తెలుసు. అందుకే అంత ధైర్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాను తీయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా కథ సిద్దం చేసుకున్నప్పుడే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని ఉంటాడు జక్కన్న. ఇక రాజమౌళి సినిమా అంటే ప్రతి ఒక్క హీరో ఎదురుచూస్తుంటారు కాబట్టి ఎన్టీఆర్, చరణ్ లు ఒప్పుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఇక ఫైనల్ గా ఈసినిమా అయితే మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చాలా వరకూ ప్రమోషన్ కార్యక్రమాలు జరిపారు చిత్రబృందం. సౌత్ నుండి నార్త్ వరకూ వీలైనంత మేరకు ప్రమోషన్స్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటి వరకూ జరిగిన ప్రమేషన్ కార్యక్రమాల్లో జక్కన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి.. వారి నటన, సెట్ లో ఎలా ఉంటారు ఇలా పలు ఆసక్తికర విషయాలు చెప్పగా రీసెంట్ గా ఒక ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న జక్కన్న ఎన్టీఆర్, చరణ్ కు మధ్య ఉన్న చిన్న తేడా ఏంటో చెప్పుకొచ్చాడు. ఈసినిమా షూటింగ్ లో భాగంగా చరణ్ ఒక సీన్ లో చాలా బాగా చేశాడు.. మానిటర్ చూస్తున్న నేను చరణ్ ని చూసి ఆశ్చర్యపోయి.. ఇక సీన్ అయిపోయిన తరువాత చరణ్ ను హత్తుకొని చాలా బాగా చేశావని చెప్పా.. అయితే చరణ్ మాత్రం ఏం మాట్లాడకుండా మళ్లీ మానిటర్ లో చూసుకొని బాగా చేశానా.. ఓకేనా అన్నాడు. చరణ్ కు తన మీద నమ్మకం కొంచం తక్కువ. అదే తారక్ విషయానికొస్తే.. తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.. తన నటన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది.. ఇదే సినిమాలో ఎన్టీఆర్ ఒక సీన్స్ లో అద్భుతంగా చేశాడు.. ఆ విషయం నేను చెప్పేలోపే తనే ఇరగ్గొట్టేశా కదా అని అన్నాడు.. ఇదే వారిద్దరిలో ఉన్న చిన్న తేడా అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: