‘ఖిలాడి’ సినిమాపై మీనాక్షి, డింపుల్ హయాతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Khiladi Movie Heroines Talk about the film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Khiladi,Khiladi Telugu Movie,Khiladi Upcoming Movie,Khiladi latest Updates,Khiladi Movie Updates,Khiladi latest News,Khiladi Upcoming Movie Updates,Khiladi Movie Heroines, Khiladi Movie Heriones About the Film,Khiladi Heroines Talks About Movie,Meenakshi Chaudhary about Khiladi Movie,Meenakshi Chaudhary Talks About Khiladi Movie, Meenakshi Chaudhary Talks About Interesting Elements About the Movie,Dimple Hayathi in Khiladi Movie,Dimple Hayathi Talks About Interesting Elements in Movie, Dimple Hayathi Movies,Dimple Hayathi latest Movies,Dimple Hayathi Upcoming Movie,Dimple Hayathi Latest Updates in 2022,Dimple Hayathi and Meenakshi Chaudhary About Khiladi Movie, Meenakshi Chaudhary and Dimple hayathi Comments about Khiladi Movie,Ravi Teja Movie Khiladi,Ravi Teja Upcoming Movie Khiladi Movie,#Khiladi,#massmaharajaravieja

క్రాక్ సినిమా విజయం తర్వాత రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కగా.. ఈనెల 11వ తేదీనప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనిలో భాగంగానే చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తుండగా ఈ భామలు కూడా జోరుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో వీరిద్దరూ ఖిలాడి సినిమా గురించి.. తమకు ఈసినిమాలో అవకాశం రావడం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. రవితేజ సినిమా అనగానే ఏం ఆలోచించకుండా ఒప్పుకున్నాను.. రెండో సినిమాకు ఇలాంటి సినిమా రావ‌డం గ్రేట్‌. ఆయన కామెడీ టైమింగ్ ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది. ఇక ఆయన ఎనర్జీని మ్యాచ్ అవ్వాలంటే కష్టం.. అందుకే నేను కూడా చాలా హోం వర్క్ చేశాను.. నిజానికి తెలగు డైలాగ్‌లు చెప్ప‌డం నాకు బిగ్ టాస్క్‌.. కొన్ని సీన్స్ చేసేట‌ప్పుడు నాకు కొంచం భయంగా ఉండేది.. కానీ రవితేజ గారు మాత్రం చాలా సపోర్ట్ ఇచ్చేవారు. నేను కంఫ‌ర్ట్ అయ్యే వ‌ర‌కు టైం తీసుకోమ‌నేవారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ఏ సినిమా అయినా పాత్ర నిడివి ఎంత అనేది చూడ‌ను. క‌థ‌లో భాగంగా పాత్ర ప్రాధాన్య‌త చూస్తాను. నేను యాక్టింగ్ స్కూల్‌లో నేర్చుకున్న‌ది కూడా ఇదే. పాత్రను వెంట‌నే జ‌డ్జ్ చేయ‌లేం. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో అన్ని ఎమోష‌న్స్ వుంటాయి. త‌మిళంలో విజ‌య్ ఆంథోని న‌టించిన కొలై లో న‌టించాను. అది త్వ‌ర‌లో విడుద‌ల‌కాబోతుంది. మ‌రో రెండు సినిమాలు లైన్‌లో వున్నాయి అని తెలిపింది.

డింపుల్ హ‌యాతీ మాట్లాడుతూ.. డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడే నా పాత్రకు హీరోతో ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉంటుందని అర్థమైంది.. అయితే ఎక్కడో ఒక చిన్న డౌట్ మాత్రం ఉంది.. కానీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అర్థమైంది.. డైరెక్టర్ చెప్పినట్టే నా పాత్ర ర‌వితేజ‌తో పాటు ఈక్వెల్ గా తీశారు. గ‌ద్దెల‌కొండ‌ లో ఐటం సాంగ్ చేస్తే అలాంటివే వ‌స్తాయ‌ని అన్నారు కూడా. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ కొంత గ్యాప్ తీసుకుని న‌టిగా నిరూపించుకోవాల‌ని మంచి సినిమా కోసం వెయిట్ చేశాను. ల‌క్కీగా ర‌వితేజ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. న‌టిగా ఖిలాడి సినిమా సంతృప్తినిచ్చింది అని చెప్ప‌గ‌ల‌ను. ఇలాంటి పాత్ర ఇంత‌కుముందు ఎప్ప‌డూ రాలేదు. సినిమా విడుద‌ల‌కు ముందు ఎగ్జైట్‌మెంట్ వుంటుంది. ఇప్పుడు అలానే ఉంది నాకు అంటూ తెలిపింది.

కాగా ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =