కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 199

Nani Reveals Interesting Inside Story About Mega Star Chiranjeevi and Sridevi Timeless Classic Jagadeka Veerudu Athiloka Sundari
సినిమా వార్తలు

నాని మాటల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా వెనుక కథ..!

మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా ఎన్ని సంచనాలు సృష్టించిందో తెలుసు. ఈ సినిమా 1990 మే 9వ తారీకున రిలీజ్ అవ్వగా.. ఈ ఏడాదితో 30 ఏళ్లు అవుతుంది.

TFN Adminవాట్సాప్
Sunil To Play A Key Role In NTR30
సినిమా వార్తలు

#NTR 30 మూవీలో కీలక పాత్రలో సునీల్ ?

పలు సూపర్ హిట్ మూవీస్ లో కమెడియన్ గా తన స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరించిన సునీల్ స్టార్ కమెడియన్ గా రాణించి హీరోగా మారారు. సునీల్ హీరోగా నటించిన కొన్ని మూవీస్ పరాజయం పాలవడంతో తిరిగి కమెడియన్ గా నటిస్తున్నారు. సినిమాలలో రావడానికి ముందే దర్శకుడు త్రివిక్రమ్, సునీల్ మంచి స్నేహితులు. సునీల్ స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకొనడానికి త్రివిక్రమ్ సపోర్ట్ ఉంది.

Team TFNవాట్సాప్
Arvind Swami To Play Stylish Villain In Upcoming Prabhas Movie
సినిమా వార్తలు

ప్రభాస్ తో తలపడనున్న స్టైలిష్ విలన్ అరవింద్ స్వామి..!

ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెండి తెరపై ఒక ఊపు ఊపిన హీరోలు ఇప్పుడు రీ ఎంట్రీ లో విలన్ పాత్రల్లో తమ సత్తా చూపిస్తున్నారు. జగపతి బాబు, మాధవన్, వివేక్ ఒబెరాయ్ ఇంకా ఈ లిస్ట్ లో అరవింద్ స్వామి కూడా వున్నారు. 90వ దశకంలో రోజా, బొంబాయి లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ స్వామి క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తున్నాడు. ఇక ధృవ సినిమాతో మంచి స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామి కి ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ?

సూపర్ హిట్ "జెంటిల్ మేన్ " తమిళ మూవీ తో దర్శకుడిగా కోలీవుడ్ కు శంకర్ పరిచయం అయ్యారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన కాదలన్ (ప్రేమికుడు ), ఇండియన్ (భారతీయుడు ), జీన్స్, ముదల్ వన్ (ఒకే ఒక్కడు ), శివాజీ , ఏందిరన్ (రోబో),ఐ , 2. 0 మూవీస్ ఘనవిజయం సాధించాయి. దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 (భారతీయుడు 2) మూవీ ని రూపొందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తమిళ్ లో మరో భారీ ఆఫర్ కొట్టేసిన థమన్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు థమన్. ఈ మధ్య వచ్చిన 'అల వైకుంఠపురములో ' సినిమా ఆడియోకు మంచిపేరు రావడంతో థమన్ కు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్" సోలో బతుకే సో బెటర్", రవితేజ మూవీ "క్రాక్", కీర్తి సురేష్ "మిస్ ఇండియా" , నాని "టక్ జగదీష్", వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు. వాటితో పాటు వి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇంకా సెట్స్ పైకి రాని సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB 27, యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు కూడా థమన్ ను అనుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్ - పారితోషికం తగ్గించుకున్న విజయ్‌ ఆంటోనీ..!

విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ఇటీవలే విజయ్ ఆంటోనీ, యాక్షన్ హీరో అర్జున్ తో కలిసి నటించిన కిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా తెలుగులో ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేదు కానీ.. తమిళ్ లో మాత్రం ఈ సినిమా భారీ విజయం సాధించింది. ‌ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శర్వానంద్ కు జోడీ గా అదితి

"సమ్మోహనం" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి తరువాత "అంతరిక్షం 9000 KMPH " మూవీ లో నటించారు. అదితి హీరోయిన్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. పలు తమిళ, హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న అదితి ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Rebel Star Prabhas To Sport A Different Look For Nag Ashwin Directorial
సినిమా వార్తలు

#Prabhas 21 మూవీలో డిఫరెంట్ లుక్

గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. మరో షెడ్యూల్ తో #Prabhas 20 మూవీషూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. హీరో ప్రభాస్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Naga Chaitanya and Tamannaah Youthful Romantic Entertainer 100 Percent Love Completes 9 Years
సినిమా వార్తలు

నాగచైతన్య, తమన్నా ‘100% లవ్’కి 9 ఏళ్ళు

యువసామ్రాట్ నాగచైతన్య కెరీర్‌లో పలు రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ ఉన్నాయి. వాటిలో ‘100% లవ్’ ఒకటి. ‘ఏ మాయ చేసావె’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత చైతు హీరోగా రూపొందిన ‘100% లవ్’ కూడా అదే బాట ప‌ట్టింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో చైతుకి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. కె.ఆర్.విజయ, విజయకుమార్, నరేష్, నందు, తార ఆలీషా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, యమ్.యస్.నారాయణ ముఖ్య భూమికలు పోషించగా మేఘనా నాయుడు ప్రత్యేక గీతంలో మెరిసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న 'ఎఫ్3'..!

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. అంతేకాదు రూ.120 కోట్ల గ్రాస్,రూ.80 షేర్‌ను రాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా వెంకీ,వరుణ్ ఆఖరికి దిల్ రాజు కెరీర్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు అనిల్ రావిపూడి, దిల్ రాజు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అనుష్క ఇన్ స్టా గ్రామ్ లో 3 మిలియన్ ఫాలోవర్స్

సక్సెస్ ఫుల్ "సూపర్" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క 15సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. విక్రమార్కుడు, శౌర్యం, అరుంధతి, వేదం, బాహుబలి, బాహుబలి 2, రుద్రమ దేవి, భాగమతి వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Director Chandoo Mondeti To Team Up With Sharwanand For A Periodic Love Story
సినిమా వార్తలు

శర్వానంద్‌తో చందు మొండేటి సెమి - పిరియాడిక్ లవ్ స్టోరీ

వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న యువ దర్శకుల్లో చందు మొండేటి ఒకరు. ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న చందు.. మూడో చిత్రంగా ‘సవ్యసాచి’ని తెరకెక్కించాడు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో స్వల్ప విరామం తరువాత ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా ‘కార్తికేయ2’ని రూపొందించనున్నాడు చందు. లాక్ డౌన్ పిరియ‌డ్ అనంతరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Team TFNవాట్సాప్
Akkineni Nagarjuna Musical Blockbuster Varasudu Completes 27 Years
సినిమా వార్తలు

నాగార్జున ‘వారసుడు’కి 27 ఏళ్ళు

‘కింగ్’ నాగార్జున, దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం ‘వారసుడు’. హిందీ సినిమా ‘ఫూల్ ఔర్ కాంటే’కి రీమేక్‌గా రూపొందిన ఈ మూవీలో నాగ్ సరసన నగ్మా నాయికగా నటించింది. నాగ్‌కి తండ్రిగా సూపర్ స్టార్ కృష్ణ కీలక పాత్రలో దర్శనమివ్వగా.. శ్రీకాంత్, బ్రహ్మానందం, బాబుమోహన్, దేవరాజ్, గుమ్మడి, తనికెళ్ళ భరణి, శరత్ సక్సేనా, బాల‌య్య‌, గీత, తిరుపతి ప్రకాష్, రవితేజ ముఖ్య భూమికలు పోషించారు. మురళీమోహన్ సమర్పణలో శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తారక్, చరణ్ మధ్య నిలబడగలిగే నటి కావాలి.. అందుకే అలియా..!

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అంతేకాదు ఈ లాక్‌డౌన్ సమయంలో RRR మూవీ గురించి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తామని చెప్పారు. దీనిలో భగంగానే ఇటీవలే చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ వీడియో కోసం చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
స్పెషల్

మెగాస్టార్ చిరంజీవి సారథ్య సమర్ధతలకు నిదర్శనం సి సి సి

ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఎవరి నోట విన్నా ఇదే మాట... నిజానికి కరోనా తీవ్రరూపం దాల్చి సమస్త ప్రపంచము స్తంభించి పోతుందని ఎవరూ ఊహించలేదు... సెంటినరీకి చేరువవుతున్న ఇండియన్ సినిమా టాకీ చరిత్రలో భారతీయ సినిమా ఇంత మూకీగా మారిపోవటం ఒక అనూహ్య పరిణామం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిరుద్యోగ నిస్సహాయతలోకి జారిపోయిన చిత్ర పరిశ్రమకు నిజమైన చేయూత కావాలి. కానీ ఆ చేయూత ఎలా లభిస్తుంది? ఎవరి ద్వారా లభిస్తుంది? గడప దాటకూడదు.. మనిషిని మనిషి తాకకూడదు... కరచాలనాలు... ఆలింగనాలు... పలకరింపులు పులకరింపులు నిషిద్ధమైన నికృష్ట పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదిక మీద సహాయ కార్యక్రమాలు జరగాలి అంటే అదెలా సాధ్యం...? ఇచ్చేవారు…

Team TFNవాట్సాప్
Butta Bomma Song Was Initially Not A Part Of Alavaikunthapurramuloo Album Says Music Director Thaman
సాంగ్

'బుట్ట బొమ్మ' పాట 'అల వైకుంఠపురములో' అనుకోలేదు ముందు..!

'అలవైకుంఠపురములో' సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. థమన్ సూపర్ హిట్ ఆడియోను అందించాడు. 'సామాజ వరగమనా' ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటినుండి మొదలైన రికార్డుల మోత ఇప్పటికీ కొనసాగుతుంది. 'బుట్ట బొమ్మ', రాములో రాములా' పాటలు కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్ కు ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం చూసాం. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆయన సతీమణితో కలిసి రీసెంట్ గా బుట్టబొమ్మ సాంగ్ స్టెప్ ను వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక తాజాగా ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్…

TFN Adminవాట్సాప్
Armaan Malik Thanks Audience for Butta Bomma Song
సాంగ్

'బుట్ట బొమ్మ' రికార్డ్స్ థాంక్స్ చెబుతున్న అర్మన్ మాలిక్

త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈసినిమాలో పాటలు ఎంత రికార్డ్స్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిలియన్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ పాటలు వ్యూయర్‌షిప్‌ పరంగా పలు రికార్డులు నమోదు చేశాయి. ఇక బుట్ట బొమ్మ మరో రికార్డ్ క్రియేట్ చేసింది.గత నెలలో 100 మిలియన్ల మార్కు దాటిన ఈ బుట్టబొమ్మ వీడియో సాంగ్ తాజాగా 150 మిలియన్ల మార్కు చేరుకోవడం విశేషం. 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో బుట్టబొమ్మ…

TFN Adminవాట్సాప్
Talasani Srinivas Yadav About Telugu Film Industry
సినిమా వార్తలు

ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుంటుంది.. తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈ కరోనా కష్టకాలంలో ఎవరు పలకరించినా ఏదో తెలియని ఊరడింపు పొందిన భావన కలుగుతుంది. ముఖ్యంగా కరోనా కరాళ నృత్యం చేస్తూ ప్రపంచాన్నే దిగ్బంధనం చేసిన విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి పలకరింపు కోసం పరితపిస్తున్న నేపథ్యంలో "మీకోసం నేను ఉన్నాను... మా ప్రభుత్వం ఉంది" అనే భరోసా ఇస్తూ రాష్ట్ర మంత్రి పలకరిస్తే ఎంతో ఊరటగా అనిపిస్తుంది కదూ... చిత్ర పరిశ్రమకు అలాంటి ఊరటను, భరోసాను ఇవ్వటం కోసం తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖమాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకు వచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర సినీ సంబంధిత మంత్రులు చేయని విధంగా కష్టకాలంలో సినిమా పరిశ్రమను పలకరించిన ఏకైక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే…

Team TFNవాట్సాప్
Akkineni Nagarjuna Appeals Mega Star Chiranjeevi To Come Up With A Stringent Action Plan Against Fake News
సినిమా వార్తలు

చిరు గారు అండగా ఉంటే సరిపోదు.. యాక్షన్ ప్లాన్ కావాలి..!

కిల్ ఫేక్ న్యూస్ అంటూ విజయ్ దేవరకొండ స్టార్ట్ చేసిన వీడియోకు మంచి స్పందనే వచ్చింది. మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ 'ది దేవరకొండ ఫౌండేషన్' స్థాపించి 'మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో సహాయక కార్యక్రమాలు చేప‌ట్టగా దానిపైనా పలు వార్తలు వచ్చాయి. తనపై వచ్చిన వార్తలను ఖండిస్తూ విజయ్.. ఫేక్ న్యూస్ రాసిన వారిపై మండిపడ్డాడు.

TFN Adminవాట్సాప్
మొన్న అల్లు అర్జున్.. నిన్న సల్మాన్.. రేపు ఎవరో..?
సినిమా వార్తలు

మొన్న అల్లు అర్జున్.. నిన్న సల్మాన్.. రేపు ఎవరో..?

కొరటాల శివ-చిరు కాంబినేషన్ 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.

TFN Adminవాట్సాప్

షేర్