సక్సెస్ ఫుల్ “సూపర్” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క 15సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. విక్రమార్కుడు, శౌర్యం, అరుంధతి, వేదం, బాహుబలి, బాహుబలి 2, రుద్రమ దేవి, భాగమతి వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం” విడుదలకు సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా లో ఇన్ స్టా గ్రామ్ ద్వారా అనుష్క తన అభిమానులతో టచ్ లో ఉంటారు. ఇప్పుడు అనుష్క ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య 3 మిలియన్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులతో మీ ప్రేమ , అభిమానం, సపోర్ట్ కు థ్యాంక్స్అని , బాధ్యత తో మీరందరూ ఇళ్ళకే పరిమితం అవుతారని ఆశిస్తున్నాను అంటూ అనుష్క “నిశ్శబ్ధం” మూవీ లోని ఒక ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: