విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ఇటీవలే విజయ్ ఆంటోనీ, యాక్షన్ హీరో అర్జున్ తో కలిసి నటించిన కిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా తెలుగులో ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేదు కానీ.. తమిళ్ లో మాత్రం ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘తమిళరసన్’, ‘అగ్ని సిరగుగళ్’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ ఇప్పుడు విజయ్ ఆంటోని తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నిర్మాతలు. అదేంటంటే.. కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దీనితో నిర్మాతలు కాస్త ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాలకు సంబంధించి నిర్మాతలకు అండగా ఉండేందుకు తన పారితోషికంలో 25 శాతాన్ని తగ్గించుకున్నాడట. విజయ్ ఆంటోనీ. ‘నిర్మాతల కష్టాలను అర్థం చేసుకుని పారితోషికం తగ్గించుకున్న విజయ్ ఆంటోనీకి ధన్యవాదాలు.. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ నిర్మాతలకు అండగా ఉండాల్సిన తరుణమిది…ప్రొడ్యూసర్స్ యాక్టర్‌గా విజయ్ ఆంటోనీ ఒక ఉదాహరణగా నిలిచారు’’ అని ‘ఖాకీ’ చిత్రనిర్మాత టి. శివ ప్రశంసించారు.
ఇక విజయ్ తీసుకున్న నిర్ణయంపై పలువురు నిర్మాతలు కూడా స్పందించి.. మిగిలిన హీరోలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో హీరోలు రెమ్యునేషన్స్ తగ్గించుకోవాల్సిందే అంటూ కొద్ది రోజులు క్రితం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా అన్నారు. మరి విజయ్ ఆంటోనీ నిర్ణయం చూసి అయినా హీరోలు ఈ నిర్ణయం తీసుకుంటారేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: